https://oktelugu.com/

Harish Shankar: పవన్ కళ్యాణ్, రవితేజల మీద సంచలన కామెంట్స్ చేసిన హరీష్ శంకర్…

కమర్షియల్ సినిమాలను తీసి సక్సెస్ కొట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే హీరో తాలూకు ఇమేజ్ ను, కథ తాలూకు ఎమోషన్ ను బ్యాలెన్స్ చేస్తు సినిమాను సక్సెస్ చేయాల్సి ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 12:56 PM IST

    Harish Shankar

    Follow us on

    Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ దక్కుతుంది. నిజానికి వాళ్ళు చేసిన సినిమాల ద్వారా కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా కావచ్చు, ఏది ఏమైనప్పటికి వాళ్ళు ప్రేక్షకులలో మాత్రం ఒక చెరగని ఒక ముద్రను వేసుకుంటారు. అందువల్ల వాళ్ళ సినిమాల కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయితే మాత్రం వాటికి సూపర్ సక్సెస్ లను కట్టబెట్టడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలాగే మాస్ మహారాజా రవితేజ గురించి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక వీళ్ళిద్దరితో హరీష్ శంకర్ కి మంచి సన్నిహిత్యం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కి దాదాపు పది సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ సినిమా లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇచ్చిన దర్శకుడు కూడా హరీష్ శంకరే కావడం విశేషం.. ఇక ప్రస్తుతం రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేసి ఆయనకు ఒక భారీ సక్సెస్ ని అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హరీష్ శంకర్ ని కొంతమంది రిపోర్టర్లు పవన్ కళ్యాణ్, రవితేజ ఇద్దరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటి అని అడగారు. ఇక దానికి హరీష్ శంకర్ సమాధానం చెబుతూ వాళ్ళిద్దరు సినిమా సక్సెస్ అయిన, ఫ్లాప్ అయిన ఒకే రకంగా ఉంటారు. హిట్ అయితే పొంగిపోవడం, ఫ్లాప్ అయితే కృంగిపోవడం లాంటివి ఉండవు.

    అలాగే ఇద్దరు కూడా చాలా మంచి ‘హ్యూమన్ బీయింగ్స్’ అంటూ ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. అయితే హరీష్ శంకర్ అటు పవన్ కళ్యాణ్ కి, ఇటు రవితేజ కి చాలా మంచి ఫ్రెండ్ కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా 50% షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ సెట్స్ మీద ఉంది.

    ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మిష్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన రామ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాని కూడా నాలుగు నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది…

    చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… ఇక అలాగే వరుసగా నాలుగు ఫ్లాపులతో ఉన్న రవితేజకు భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే వీళ్లిద్దరి కెరియర్లు కూడా టాప్ గేర్ లో దూసుకుపోతాయనే చెప్పాలి…