https://oktelugu.com/

Gaami Box Office Collections: గామి 10 డేస్ కలెక్షన్స్… విశ్వక్ సేన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది?

గామి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.20 కోట్లకు అమ్మారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ. 10.2 కోట్ల బిజినెస్ జరిగింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో గామి విడుదలైంది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 18, 2024 / 10:07 AM IST

    Gaami Movie 10 Days Box Office Collections

    Follow us on

    Gaami Box Office Collections: విశ్వక్ సేన్(Vishwak Sen) ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో ప్రేక్షకులను పలకరించాడు. ఆయన లేటెస్ట్ మూవీ గామి మార్చి 8న విడుదలైంది. విద్యాధర్ కాగిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గామి మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. గామి చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేశారు. హీరో ప్రభాస్ గామి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. గామి మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇక 10 రోజుల్లో గామి వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    గామి నైజాంలో రూ. 4.04 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే సీడెడ్ లో రూ.1.10 కోట్లు వసూలు వేసింది. ఇక ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ రూ. 68 లక్షలు, వెస్ట్ రూ. 37 లక్షలు, గుంటూరులో 44 లక్షలు, కృష్ణా లో రూ. 42 లక్షలు, నెల్లూరు రూ. 28 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గామి రూ. 8.11 కోట్ల షేర్, 14. 40 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 11.4 కోట్ల షేర్, 22.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

    గామి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.20 కోట్లకు అమ్మారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ. 10.2 కోట్ల బిజినెస్ జరిగింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో గామి విడుదలైంది. పదిరోజులకు రూ. 11.4 కోట్లు వసూలు చేసి మూవీలో లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. అంటే హిట్ స్టేటస్ అందుకుందన్నమాట. గామి తో విశ్వక్ సేన్ కి క్లీన్ హిట్ పడింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గామి మూవీ మీద కావాలనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

    తన సినిమాను కూడా నలుగురు ఇండస్ట్రీ పెద్దలు చూసి మాట్లాడాలని, ప్రోత్సహించాలని మీడియా ముఖంగా మాట్లాడాడు. కాగా గామి చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఒక అరుదైన వ్యాధితో బాధపడే అఘోరగా ఆయన కనిపించాడు. ఇక విభిన్నమైన సబ్జెక్టుతో గామి తెరకెక్కింది. కీలక రోల్ లో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి నటించింది. గామి చిత్రం కోసం చాలా కష్టపడ్డామని యూనిట్ అన్నారు. వాళ్ళ కష్టానికి హిట్ రూపంలో ఫలితం దక్కింది.