https://oktelugu.com/

Chiranjeevi: మెగాస్టార్ బ్రాండ్ కోసం చిరంజీవి తో పోటి పడిన హీరోలు వీళ్లే…

ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళకి మంచి సినిమా తీశారు అనే గుర్తింపు అయితే వస్తుంది కానీ, వాళ్లకి మార్కెట్ అనేది పెరగదు. అలాగే స్టార్డమ్ అనేది వర్తించదు. వాళ్ళ సినిమాలను చూడడానికి జనాలు కూడా పెద్దగా ఇష్టపడరు.

Written By:
  • Gopi
  • , Updated On : March 1, 2024 / 01:32 PM IST
    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలోకి ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడు అంటే ఇక్కడ తన సత్తా ఏంటో చూపించుకొని నెంబర్ వన్ హీరోగా కొనసాగడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంటారు. అందుకే ప్రతి హీరో టార్గెట్ ఒకటే ఎన్ని ఎక్కువ సక్సెస్ లు సాధిస్తే అంత స్టార్ట్ డమ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ హీరోలు ఎలాంటి కథలతో సినిమాలు చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎన్ని సక్సెస్ లు వచ్చాయి అనే దాని మీదనే హీరోల మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది.

    కాబట్టి ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళకి మంచి సినిమా తీశారు అనే గుర్తింపు అయితే వస్తుంది కానీ, వాళ్లకి మార్కెట్ అనేది పెరగదు. అలాగే స్టార్డమ్ అనేది వర్తించదు. వాళ్ళ సినిమాలను చూడడానికి జనాలు కూడా పెద్దగా ఇష్టపడరు. ఫస్ట్ డే వాళ్ళకి ఓపెనింగ్స్ అయితే ఎక్కువగా రావు. అందుకే ఇలాంటి ఫార్మాట్లన్నింటిని తొలగించడానికి ప్రతి హీరో కమర్షియల్ సినిమాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తూ ఉంటారు…

    ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు చిరంజీవి కూడా తన డ్యాన్స్ తో , ఫైటింగ్స్ తో ప్రేక్షకులని కొత్త లోకానికి తీసుకెళ్లాడు. కానీ ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను చేస్తూనే ముందుకు సాగాడు. అందువల్లే ఆయన మాస్ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు. ఇక చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ రేంజ్ కి వెళ్లే క్రమంలో ఆయనకి హీరో సుమన్ నుంచి గట్టి పోటీ అయితే ఎదురైంది. అప్పుడు సుమన్ వరుసగా సూపర్ హిట్ సినిమాలను తీస్తూ తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు.

    ఇక బాలయ్య బాబు(Balakrishna) కూడా మంగమ్మగారి మనవడు, భైరవద్వీపం లాంటి మంచి సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన మార్కెట్ ని విపరీతంగా పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య చిరంజీవికి కూడా చాలా సార్లు పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. కానీ చిరంజీవి అందరిని బీట్ చేస్తూ వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ ఇండస్ట్రీలో తన పేరుకు ముందు మెగాస్టార్ అనే ఒక బ్రాండ్ నేమ్ ను సంపాదించుకున్నాడు…