https://oktelugu.com/

Mega Family: నాగబాబుతో అల్లు అర్జున్ వివాదం… నిహారిక సంచలన కామెంట్స్, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

నాగబాబుతో పాటు మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి విబేధాలు నడుస్తున్నాయనే వాదన ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు తెలపడం సంచలనం రేపింది. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేసింది. ఈ వివాదం పై తాజాగా నిహారిక మాట్లాడింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 31, 2024 8:51 am
    Mega Family

    Mega Family

    Follow us on

    Mega Family: అల్లు అర్జున్ ఒక ఇమేజ్ వచ్చాక మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నాడు అనే వాదన ఉంది. అందుకే ఆయన అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నారు. సరైనోడు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్ చిచ్చు పెట్టింది. దువ్వాడ జగన్నాధమ్ మూవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాయ్ కాట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సంధి కుదుర్చుకునేలా మాట్లాడారు.

    Also Read: అల్లు అర్జున్ సర్జరీల గుట్టు విప్పిన ప్రముఖ డాక్టర్… ఆ రెండు పార్ట్స్ కి జరిగిందంటూ కీలక కామెంట్స్, వీడియో వైరల్

    ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతుంది. అల్లు-మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్. దీనికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిలో జాయిన్ అయ్యారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కంటెస్ట్ చేశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ కృషి చేసింది.

    చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని వీడియో బైట్ విడుదల చేశాడు. నాగబాబు, ఆయన సతీమణి పిఠాపురంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ రోడ్ షోలు నిర్వహించారు. రామ్ చరణ్ ప్రచారానికి చివరి రోజు పిఠాపురం వెళ్లారు. కాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పాడు. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషించారు.

    అనూహ్యంగా అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన మద్దతు ప్రకటించాడు. స్వయంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ తన మిత్రుడు రవికి ఓటు వేయాలని కోరారు. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్లు అయ్యింది. ఇది మెగా ఫ్యామిలీకి నచ్చలేదనే వాదన ఉంది. మే 13 సాయంత్రం పోలింగ్ ముగిశాక నాగబాబు ఒక ట్వీట్ వేశారు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే… అని కామెంట్ పోస్ట్ చేశాడు.

    నాగబాబు చేసిన కామెంట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అనే ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అనంతరం సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. పరోక్షంగా అల్లు అర్జున్ పై సాయి ధరమ్ తన అసహనం బయటపెట్టాడని పలువురు భావించారు. అసలు వైసీపీ నేతకు అల్లు అర్జున్ మద్దతు తెలపడాన్ని మెగా హీరోలు ఎలా తీసుకున్నారు? ఈ పరిణామం వివాదం రాజేసిందా? అనే చర్చ జరుగుతుంది.

    ఈ క్రమంలో నాగబాబు డాటర్ నిహారిక దీనిపై స్పందించారు. ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాన్నగారు(నాగబాబు) ట్విట్టర్ ఎక్స్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆయన వాట్సప్ స్టేటస్ లో కూడా ప్రతిరోజు ఒక సూక్తి పెడతారు. ఆయన ఎందుకు ట్విట్టర్ లో ఆ కామెంట్ పెట్టారో నాకు తెలియదు. కుటుంబంలో ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి… అని అన్నారు.

    Also Read: రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కూడా ఆడిపాడరనే విషయం మీకు తెలుసా..?