Kalki Pre Release Event: ప్రభాస్ కి కమలహాసన్ అంటే అంత ఇష్టమా.? ఆయన కోసం ఏకంగా ఆ పని చేశారా..?

ప్రభాస్ కి, కమలహాసన్ అంటే చాలా ఇష్టం ఉండటానికి కారణం ఏంటి అంటే కమలహాసన్ యాక్టింగ్ అని ప్రభాస్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.

Written By: Gopi, Updated On : June 20, 2024 8:10 am

Kalki Pre Release Event

Follow us on

Kalki Pre Release Event: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రీసెంట్ గా ముంబైలో నిర్వహించారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ కల్కి సినిమా చేయడం అనేది నాకు ఒక మంచి అవకాశం. ఈ సినిమాలో చాలా గొప్ప విషయాలు డీల్ చేశారని అలాగే విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ప్రభాస్ చెప్పాడు. ఇక అలాగే అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి దిగ్గజ నటులు ఆయనకు నటన లో కొన్ని మెలుకువలు నేర్పారట.

ఇక వాళ్ళతో నటించడం ఆయనకి కి చాలా వరకు హెల్ప్ అయిందని వాళ్ళ సజెషన్స్ కూడా తను తీసుకున్నాడు అని చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ చిన్నప్పటి నుంచి కమలహాసన్ కి వీరాభిమానట. కమలహాసన్ హీరోగా చేసిన సాగర సంగమం సినిమాలో అతను వేసుకున్న డ్రెస్ ని కొనివ్వమని వాళ్ల అమ్మను చాలా ఇబ్బంది పెట్టాడట. ఇక ఆయన బాధ భరించలేక సిటీ లో ఉన్న షాప్స్ మొత్తం తిరిగివాళ్ళ అమ్మ మొత్తానికైతే తనకు ఆ డ్రెస్ కొని పెట్టిందంట.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి, కమలహాసన్ అంటే చాలా ఇష్టం ఉండటానికి కారణం ఏంటి అంటే కమలహాసన్ యాక్టింగ్ అని ప్రభాస్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇక అందుకే కమలహాసన్ నటనకి తను ఫిదా అయిపోయాడని ఇక ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా తను వదలకుండా చూస్తానని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాడు. ఇక మొత్తానికైతే కల్కి సినిమాతో ఈ లెజెండరీ నటులతో నటించే అవకాశం మాత్రం ప్రభాస్ కు వచ్చిందనే చెప్పాలి. మరి ప్రభాస్ ఈ సినిమా ని విజయ్ తీరాలకు చేర్చడంలో ఎంతవరకు కృషి చేశాడు.

ఈ సినిమాకి ముందు ఆయన చేసిన సలార్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ ని సాధిస్తుందా.? ఇక 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈజీగా 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రాణిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…