https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

వింత ఎలిమినేషన్, నామినేషన్, కన్ఫ్యూజన్, రీ ఎంట్రీ అంటూ నడుస్తుంది బిగ్ బాస్. రకరకాల కుప్పిగంతులు వేస్తూ అందరు కలిసి ఆట ఆడుతున్నారు. అయినా టీఆర్పీ కోసం బిగ్ బాస్ కూడా చాలా తంటాలు పడుతున్నాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 6, 2023 / 10:16 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu: రెండు నెలల క్రితం అట్టహాసంగా బిగ్ బాస్ ఏడవ సీజన్ ని మొదలుపెట్టారు యాజమాన్యం. ముందుగా కొంత మందిని ఇంట్లోకి పంపించి ఇప్పటికే అందులోంచి కొంత మంది ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చారు. ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. గొడవలు, టాస్క్ లు, లవ్ లు అంటూ గడిచిపోతుంది బిగ్ బాస్. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతే.. మరికొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అవుతున్నారు. ఇక ఈ సీజన్ కు ఉల్టా ఫుల్టా అని పేరు పెట్టారు కాబట్టి కాస్త వింత ఆటలే ఆడిస్తూ ఎంటర్టైన్ చేయిస్తున్నారు బిగ్ బాస్. అవును ఇంతకీ ఈ వింత సీజన్ లో వరస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

    వింత ఎలిమినేషన్, నామినేషన్, కన్ఫ్యూజన్, రీ ఎంట్రీ అంటూ నడుస్తుంది బిగ్ బాస్. రకరకాల కుప్పిగంతులు వేస్తూ అందరు కలిసి ఆట ఆడుతున్నారు. అయినా టీఆర్పీ కోసం బిగ్ బాస్ కూడా చాలా తంటాలు పడుతున్నాడు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్స్ కొందరు గెలవాలనే పంతంతో ఆడితే మరికొందరు మాత్రం వీక్ గా ఉంటూ.. ఇప్పుడు గేమ్ ఆడాలా అన్నట్టు ఫేస్ పెడుతూ.. ఆడకుండా ఉంటున్నారు. లేదా ఆడిన వారిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తూ వీకెండ్ వచ్చిందంటే నాగార్జునతో తిట్ల దండకం వింటున్నారు. ఇలా చేయడంలో అశ్విని నెంబర్ వన్ పొజిషన్ లో ఉందట.

    ఏం మాట్లాడుతుందో తెలియకుండా, ఆట ఎలా ఆడాలో అర్థం కాకుండా ఉంటుంది. ఆడాలని వెళ్తుంది.. వెళ్లి బజర్ నొక్కకుండా ఉంటుంది. ఆడకుండానే గొడవ పడుతుంది. ఇదిలా ఉంటే మధ్యలో గౌతమ్ ను ప్రభావితం చేస్తూ అతని ఆట తీరును చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇతరులపై ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అందుకే ఈ సారి వరస్ట్ కంటెంట్ ఈమనే అంటున్నారు నెటిజన్లు. ఇక ఇలానే కంటిన్యూ అయితే త్వరలోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం కామన్. అయినా నెగిటివిటీ ఉన్న వారిని ఎలా పంపించాలో అర్థం కాక బిగ్ బాస్ తలపట్టుకుంటే.. అశ్విని మాత్రం సైలెంట్ గా గేమ్ ఆడుతుంది. అందుకే ఆమె ఇంకా బిగ్ బాస్ ఇంట్లో కొనసాగుతుంది. కానీ ఈ మధ్య నెగిటివిటీ సంపాదించుకుంటుంది కాబట్టి ఈ సారి సేఫ్ అవ్వడం కష్టమే కాబట్టి ఆచితూచి ఆడాల్సిందే ఈ బ్యూటీ.