https://oktelugu.com/

Devara Chuttamalle Song: దేవర మూవీలో ‘చుట్టమల్లే ‘ సాంగ్ పాడిన సింగర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా భారీగా కొనసాగుతుంది. ఇక రాబోయే సినిమాలు కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు...

Written By:
  • Dharma
  • , Updated On : August 7, 2024 / 11:05 AM IST

    Devara Chuttamalle Song

    Follow us on

    Devara Chuttamalle Song: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటాయి. ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ‘ దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా ప్రేక్షకులందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ భారీ ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగం గానే ఈ సినిమా నుంచి మొదట ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో ఎన్టీయార్ రౌద్ర రూపంలో కనిపించడమే కాకుండా భారీ డైలాగులు చెబుతూ తన అభిమానులను ఆనంద పడేలా చేశాడు.ఇక ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ కూడా వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ‘చుట్టమల్లే ‘ అంటూ సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంటున్న సమయంలో ఈ సాంగ్ ను ఎవరు పాడారు అనే విషయం మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అలాగే కొంతమంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ పాటని శిల్ప రావు అనే సింగర్ పడినట్టుగా తెలుస్తుంది… ఇక ఈ శిల్పారావ్ ఎవరు అంటూ ఆమె గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇక వాస్తవానికి శిల్పారావు తెలుగు అమ్మాయి అయితే ఈమె తండ్రి అయిన వెంకట్రావు ఉద్యోగరీత్యా జంషెడ్ పూర్ లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది.

    Devara Chuttamalle Song(1)

    అయినప్పటికీ తను సింగర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఒక సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్న క్రమంలో ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆమె ‘వార్ ‘ సినిమాలో గుంగ్రు సాంగ్ తో ‘ఫిలింఫేర్ అవార్డు’ ని కూడా గెలుచుకుంది. ఇక దాంతో పాటుగా ఇక పఠాన్ సినిమాలో బేషరం రంగ్, జైలర్ సినిమాలో కావాలయ్యా, గుంటూరు కారం సినిమాలో ఓ మై బేబీ లాంటి పాటలను పాడి సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    ఇక ఇప్పుడు ‘దేవర ‘సినిమాలో ఆమె పాడిన పాట తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో ఆమె గురించి తెలుగు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లోనే ఈమె ఎక్కువ పాటలు పాడడం విశేషం… ఇక ఈమె ఫోటోగ్రాఫర్ అయిన రితేష్ కృష్ణ ను పెళ్లి చేసుకున్నారు…

    ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద భారీ హైప్ ని పెంచడానికి సినిమా యూనిట్ చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఈ మంత్ ఎండింగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలని సినిమా మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…