Jr NTR: జూనియర్ ఎన్టీయార్ సినియర్ ఎన్టీయార్ కు ఇచ్చిన మాట ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణ షాలిని అనే ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పుట్టిన కొడుకే జూనియర్ ఎన్టీఆర్...

Written By: Gopi, Updated On : February 27, 2024 12:47 pm
Follow us on

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన హీరోలలో ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు'(NTR) మొదటి వ్యక్తి అనే చెప్పాలి. ఈయన చేసిన సినిమాల వల్లే అప్పట్లో తెలుగు సినిమా అనేది ఒకటుందని దేశం అంతా తెలిసింది. ఇక ఇది ఇలా ఉంటే ఆయన సినిమాలు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలను పోషించడంలో తనని మించిన నటుడు ఇండియాలో మరొకరు లేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణ (Harikrishna) షాలిని అనే ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పుట్టిన కొడుకే జూనియర్ ఎన్టీఆర్… ఇక సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లో చాలా బిజీగా తిరుగుతున్న రోజుల్లో హరికృష్ణ సెకండ్ వైఫ్ అయిన షాలిని అలాగే జూనియర్ ఎన్టీయార్ గురించి హరికృష్ణ ద్వారా తెలుసుకొని వాళ్ళని ఒకసారి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడట, సరే అని హరికృష్ణ ఒకరోజు వాళ్లతో మాట్లాడాడు. ఇక అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన సీనియర్ ఎన్టీఆర్ నీ ముఖంలో తేజస్సు వెలిగిపోతుంది.

నువ్వు గొప్ప నటుడు అవుతావు అని చెప్పి తన పేరును ఎన్టీయార్ గా మార్చడట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ని హగ్ చేసుకుని తప్పకుండా మీరు చెప్పినట్టుగా నేను పెద్ద స్టార్ హీరో ని అవుతాను. దానికోసం చాలా కష్టపడతాను అని చెప్పాడట… ఆ మాటతో సీనియర్ ఎన్టీఆర్ చాలా మురిసిపోయాడట. ఇక చాలాసేపు జూనియర్ ఎన్టీఆర్ తో ఆడుకొని వాళ్ళ అమ్మ అయిన షాలినితో ఈ కుర్రాడు ఈ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. వీడికి సంబంధించిన అన్ని బాధ్యతలు నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాడట. దాంతో ఆవిడ కూడా చాలా సంతోష పడిందట.

జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతకి ఇచ్చిన మాట ప్రకారమే హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటున్నాడు… ఇక మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలని ఎన్టీయార్ తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి…