Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కూతురు క్లిన్ కార. లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా క్లిన్ కారను మెగా ఫ్యామిలీ ముద్దుగా ఏమని పిలుస్తారో రివీల్ అయింది. కాగా క్లిన్ కార నిక్ నేమ్ ఏంటి? ముద్దుల కూతురిని రామ్ చరణ్ ఉపాసన ఎలా పిలుస్తారు ఈ స్టోరీ లో తెలుసుకుందాం.
రామ్ చరణ్ ఉపాసన లకు పెళ్ళైన పదేళ్లకు క్లిన్ కార జన్మించింది. మెగా ఫ్యామిలీలో క్లిన్ కార చాలా స్పెషల్. ఈ చిన్నారి పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ కి బాగా కలిసొచ్చింది. క్లిన్ కార పుట్టి ఆరు నెలలు పైనే అవుతుంది. కానీ ఇంతవరకు ఈ లిటిల్ ఏంజెల్ ఎలా ఉంటుందో రివీల్ చేయలేదు. రామ్ చరణ్ – ఉపాసన లు ఎక్కడికి వెళ్లినా కూతుర్ని వెంట తీసుకు వెళ్తున్నారు. ప్రతి ఫెస్టివల్ క్లిన్ కార తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నప్పటికీ రామ్ చరణ్ కిన్ కార ముఖం దాచేస్తున్నారు. దీంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. అయితే మంచి సందర్భం చూసుకుని క్లీన్ కారను పరిచయం తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే… క్లింకార గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లింకార ని ముద్దుగా ఏమని పిలుస్తారు అనే సందేహం మెగా అభిమానుల్లో ఉంది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపాసన కొణిదెల క్లిన్ కార గురించి చెప్తూ… కారా అని సంబోధించడం జరిగింది. దీంతో ఈ చిన్నారి నిక్ ఏంటో రివీల్ అయింది. అయితే ఉపాసన మాత్రమేనా లేక కుటుంబ సభ్యులు అందరూ కారా అని పిలుచుకుంటారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కాగా క్లిన్ కార డాడ్స్ గర్ల్. చరణ్ ని చూడగానే నవ్వుతుంది. వాళ్ళను చూస్తే ఈర్ష్యగా ఉంటుంది, అంటూ ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2023 జూన్ 20న క్లిన్ కార జన్మించింది.