https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ కు ఆయన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? మీరెవ్వరూ ఎక్స్ పెక్ట్ కూడా చేయరు…

ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో తనకి ఎక్కువగా నచ్చిన సినిమాల్లో బాహుబలి మొదటి వరుస లో ఉంటుంది. కానీ బాహుబలి కాకుండా తనకు నచ్చిన సినిమా ఇంకేదైనా ఉంది అంటే అది...

Written By:
  • Gopi
  • , Updated On : February 15, 2024 / 10:22 AM IST
    Follow us on

    Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ మంచి దూకుడుని చూపిస్తున్నాడు. కొత్త హీరోలు ఎలాగైతే చాలా ఫ్రెష్ గా యాక్టింగ్ చేస్తూ, ఎక్కువ సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారో, అంతటి ఉత్సాహంతోనే ప్రభాస్ ఇప్పుడు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అవి పూర్తయితే తప్ప మరో సినిమా కమిట్ అవ్వకూడదనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో తనకి ఎక్కువగా నచ్చిన సినిమాల్లో బాహుబలి మొదటి వరుస లో ఉంటుంది. కానీ బాహుబలి కాకుండా తనకు నచ్చిన సినిమా ఇంకేదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండటమే కాకుండా, ఈ సినిమాకి ముందు ప్రభాస్ వేరు, ఈ సినిమా నుంచి ప్రభాస్ వేరు అనెంతలా తనని తాను మేకోవర్ చేసుకున్నాడు. అందుకే ప్రభాస్ అభిమానులు కూడా బుజ్జిగాడు సినిమాకి ఉన్న ఇమేజ్ మరే సినిమాకి లేదనే చెప్పాలి.

    అందుకే ప్రభాస్ అభిమానులు ఆ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ స్టార్ హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టమనే చెప్పాలి. నిజానికి బుజ్జిగాడు సినిమాకి ముందు ప్రభాస్ ఒక సాఫ్ట్ లుక్ లో ఉండేవాడు. కానీ బుజ్జిగాడు సినిమా నుంచి ఫుల్ మాస్ గా అండ్ రగడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    అలాగే ఈ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందుకే ఆ సినిమా అంటే ప్రభాస్ కు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేశాడు…ఇక ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజాసాబ్, కల్కి సినిమాలు ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి…