https://oktelugu.com/

Hanuman Movie: హనుమాన్ సినిమా చివర్లో రాముడికి హనుమంతుడు చెప్పిన మాట ఏంటో తెలుసా…?

ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లో సినిమాలు చేస్తుంటే మిగిలిన దర్శకులు మాత్రం పాన్ ఇండియాలో తమ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 21, 2024 / 12:14 PM IST

    What Hanuman said to Rama at the end of the Hanuman movie

    Follow us on

    Hanuman Movie: ఒక పది సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తం మూస ధోరణి లో సాగే కథలే వచ్చేవి. దానివల్ల పక్క ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని కొంచెం తక్కువగా చేసి చూసేవారు. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే మనల్ని మొత్తానికే పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు మన దగ్గర పెరిగిన స్టాండర్డ్స్ గాని, కథల విషయంలో మన దర్శకులు తీసుకుంటున్న కేరింగ్ గాని ఇవన్నీ చూసిన తర్వాత ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే అనేంతలా మన సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

    ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లో సినిమాలు చేస్తుంటే మిగిలిన దర్శకులు మాత్రం పాన్ ఇండియాలో తమ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీసి ఒక మంచి పని చేశారనే చెప్పాలి. ఎందుకంటే నార్త్ వాళ్ళు రాజమౌళిని మినహాయిస్తే తెలుగులో మిగిలిన దర్శకులు ఎవరు కూడా గ్రాఫిక్స్ ని వాడుతూ పెద్దగా మ్యాజిక్ ను చేయలేరని, ఒక సందర్భంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.

    కానీ యంగ్ డైరక్టర్ అయిన ప్రశాంత్ వర్మ మాత్రం హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని వాళ్లకి సరైన గుణపాఠం చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా చివర్లో హనుమంతుడు తను ధ్యాన దీక్ష నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ రాబోయే హనుమాన్ సీక్వెల్ కి పునాది వేశాడు. ఇక రాబోయే జై హనుమాన్ సినిమా ఆయన మీదే నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా చివర్లో హనుమంతునికి రాముడు చెప్పిన మాట ఏంటి అనేదానితో సినిమాని ఎండ్ చేశారు. నిజానికి ఈ మాటని సినిమాలో పెట్టకుండా హనుమంతుడు కనిపించినప్పుడే సినిమాని ఎండ్ చేయాలనుకున్నారట.

    కానీ సినిమాలో సస్పెన్స్ ని క్రియేట్ చేయడానికి, అలాగే రెండో పార్ట్ మీద ఇంట్రెస్ట్ పెరగాలనే ఉద్దేశ్యం తో ఆ మాట ను పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజానికి రాముడు హనుమంతునితో చెప్పిన మాట ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. అయితే రాముడు హనుమంతునికి చెప్పిన మాట ఏంటంటే “అన్యాయం పెరిగిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఈ భూలోకాన్ని కాపాడాలి. మంచి ని పెంచాలని” చెప్పాడని చాలామంది పండితులు కూడా చెబుతున్నారు. మరి ఇదే మాట ప్రశాంత్ వర్మ తన సినిమాలో చెప్తాడా లేదా మరేదైనా కొత్తగా చెప్తాడా అనేది తెలియాల్సి ఉంది…