Bharateeyudu 2: భారతీయుడు 2 రన్ టైమ్ చూస్తే అవాక్కవుతారు.? అంత సేపు ఎవరు చూస్తారు..?

కమలహాసన్ ప్రస్తుతం భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించడం విశేషం. ఇక అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు 2 సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తీశారు.

Written By: Gopi, Updated On : June 23, 2024 8:29 am

Bharateeyudu 2

Follow us on

Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్ మంచి నటుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న సినిమాల పరంగా చూసుకున్న, ఆయన నటనపరంగా చూసుకున్న ఆయనను మించిన వాళ్లు ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇలాంటి కమలహాసన్ ప్రస్తుతం భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించడం విశేషం. ఇక అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు 2 సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తీశారు. అయితే ఈ సినిమాలో సేనాపతి గా నటించిన కమలహాసన్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ లో నటించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని జూలై 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకస్తున్నారు.

ఇక ఈ సినిమా మూడు గంటల పది నిమిషాల నిడివితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మూడు గంటల సినిమా అంటేనే చాలా ఎక్కువ నిడివితో ఉంటుంది. అలాంటిది మూడు గంటల పది నిమిషాలు అంటే ఈ సినిమాని ఎవరైనా చూస్తారా మధ్యలో నుంచి వెళ్ళిపోతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇక ఈ సినిమా రన్ టీమ్ తెలుసుకున్న తర్వాత చాలామంది ఆడియన్స్ అంత రన్ టైమ్ ఏంటి స్వామి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న ఏ ఒక్క షాట్ కూడా మిస్ అవ్వకుండా శంకర్ చాలా జాగ్రత్త పడుతున్నాడట.

ఆయన తన మైండ్లో ఏమనుకున్నాడో దాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమా మూడు గంటల పది నిమిషాల రన్ టైమ్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందంటూ శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు…ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే శంకర్ మరోసారి పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ అవుతాడు…మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.