https://oktelugu.com/

Pawan Kalyan: జల్సా సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఇలియానా కి సారీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా..?

చిరంజీవి తో సంబంధం లేకుండా తను సపరేట్ గా స్టార్ హీరో గా ఎదిగాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 23, 2024 / 02:08 PM IST
    Follow us on

    Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి. లేకపోతే చాలా కష్టం అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా టాలెంట్ లేకపోతే ఇక్కడ మనల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయం చాలామంది నట వారసుల విషయంలో ప్రూవ్ అయింది. ఇక మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

    చిరంజీవి తో సంబంధం లేకుండా తను సపరేట్ గా స్టార్ హీరో గా ఎదిగాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమా సమయంలో అందులో హీరోయిన్ గా నటించిన ఇలియానా పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పిందనే విషయం అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే ఆమె ఎందుకు సారీ చెప్పింది అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అది ఏంటి అంటే ఇలియానా పవన్ కళ్యాణ్ ల మధ్య సాంగ్ షూట్ చేయాలి. దానికోసం పవన్ కళ్యాణ్ పొద్దున ఆరు గంటలకి సెట్ లో మేకప్ తో రెడీగా ఉన్నాడు. కానీ ఇలియానా మాత్రం 10 గంటలకు సెట్ కి వచ్చిందట.

    అప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఖాళీగానే కూర్చున్నాడు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన కోపం కూడా వచ్చిందట. ఇలియానా రాగానే ఇంత లేటు ఏంటి అని పవన్ కళ్యాణ్ ఇలియానా మీద అరిచాడట. దానికి ఇలియానా పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పింది. తనకి హెల్త్ బాలేకపోవడం వల్ల హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నట్టుగా తను చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూల్ అయ్యాడు. ఇక ఆ సాంగ్ షూట్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ డాక్టర్ ను సెట్ కే పిలిపించి తన ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయించి అక్కడే ట్రీట్మెంట్ చేయించాడట.

    దాంతో ఇలియానా మళ్ళీ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పింది… కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలియానా సెట్ కి రాగానే విషయం ఏంటో తెలియకుండా తన మీద అరిచినందుకు ఇలియానాకి సారీ చెప్పాడట…ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలా చెప్పడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ ఆ తర్వాత ఆ సినిమా యూనిట్ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్ప గా చెప్పడం విశేషం…