https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి వల్ల ఇండస్ట్రీ లో ఎదిగిన వాళ్ళు ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో చిరంజీవి నుంచి సహాయం పొందిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా మేము సహాయం పొందామని చెప్పుకోవడం లేదు. ఇక చిరంజీవి కూడా సహాయం చేసి మర్చిపోతూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 6, 2024 / 03:47 PM IST
    Follow us on

    Chiranjeevi: ఎన్టీయార్, ఏ ఎన్ ఆర్ లా తర్వాత చిరంజీవి చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ప్రతి దర్శకుడు కూడా చిరంజీవితో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ముందుకు వచ్చేవారు.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి వల్ల ఇండస్ట్రీలో చాలామంది పైకి ఎదిగారనే చెప్పాలి. అందులో మొదటి వ్యక్తి అల్లు అరవింద్. ఈయన చిరంజీవి సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి భారీ లాభాలను అందుకొని అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. ఆయన్ని స్టార్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టడంలో చిరంజీవి పాత్ర చాలా వరకు ఉందనే చెప్పాలి. ఇక అరవింద్ తో పాటు చిరంజీవి చాలామంది హీరోలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.

    అందులో ముఖ్యంగా శ్రీకాంత్ లాంటి హీరోకు అయితే చిరంజీవి బాగా సపోర్ట్ చేశాడు. ఎంతలా అంటే ఒకానొక సమయం లో శ్రీకాంత్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇక అది తెలుసుకున్న చిరంజీవి స్వయం గా తనే వెళ్లి ఆయన్ని కలిసి ఇండస్ట్రీ లో హిట్స్ , ప్లాప్స్ రావడం కామన్ అని చెప్పి కొంతమంది దర్శకులకి కూడా శ్రీకాంత్ తో సినిమాలు చేయమని వాళ్ళకి చెప్పి అలా శ్రీకాంత్ కి మంచి అవకాశాలు ఇప్పించాడు.ఇక ఆ స్టార్ డైరక్టర్లు సినిమాలు చేయడంతో శ్రీకాంత్ కెరియర్ మళ్లీ గాడిలో పడింది.

    ఇండస్ట్రీలో చిరంజీవి నుంచి సహాయం పొందిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా మేము సహాయం పొందామని చెప్పుకోవడం లేదు. ఇక చిరంజీవి కూడా సహాయం చేసి మర్చిపోతూ ఉంటాడు. ఒక్క శ్రీకాంత్ మాత్రమే చిరంజీవి చేసిన హెల్ప్ ను గుర్తుంచుకొని ఇప్పటి వరకు కూడా చిరంజీవి తో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో శంకర్ దాదా ఎబీబీఎస్, జిందాబాద్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి.

    ఇక శ్రీకాంత్ ఇప్పటికి కూడా చిరంజీవిని సొంత అన్నయ్య లాగా చూసుకుంటాడు. అందుకే చిరంజీవి, శ్రీకాంత్ ఇద్దరు ఇప్పటికీ కూడా చాలా కలిసి మెలిసి ఉంటారు. చిరంజీవి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన కూడా శ్రీకాంత్ ఆ ఫంక్షన్ కి సంభందించిన అన్ని పనులను చూసుకుంటూ ఉంటాడు. అంటే వీళ్లిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంటుంది…