Manchu Lakshmi: మంచు లక్ష్మి లేటు వయసులో ఘాటైన ఫోటో షూట్స్ కి తెరలేపుతున్నారు. అమ్మడుకి ఐదు పదుల వయసు మీద పడుతున్నా అసలు తగ్గడం లేదు. ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ హీటు పుట్టిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి ఫోటో షూట్ ఒకటి వైరల్ గా మారింది. తన ఒంటిపై ఉన్న టాటూ హైలెట్ అయ్యేలా ఆమె ఫోజులిచ్చారు. ఇంతకీ ఆ టాటూ ఏమిటని పరిశీలిస్తే… వీపు మీద ”వాట్ యూ సీ ఈజ్ సీయింగ్ యూ’ అని రాసి ఉంది. ఆత్మవిశ్వాసం,ధైర్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ ని ప్రతిబింబించేలా ఆ టాటూ అర్థం ఉంది.
ఎవరు ఏమనుకున్నా నేను నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తా అని ఆమె చెప్పకనే చెప్పింది. మంచు లక్ష్మి తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమె మాట తీరు, ప్రవర్తనను సోషల్ మీడియా జనాలు ట్రోల్ చేస్తుంటారు. కానీ తనపై వచ్చే విమర్శలను ఆమె కొట్టిపారేస్తుంది. అవన్నీ పని లేని వాళ్ళు చేసే పనులు. ఆ నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏం చేయలేమని అంటుంది. లేటెస్ట్ పోస్ట్ పై కూడా నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది. అనే హోస్ట్ గా కొన్ని టాక్ షోలు చేసింది. అలాగే రెండు మూడు ఇంగ్లీష్ మూవీస్ లో నటించింది. ఎందుకో సడన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంలో లేడీ విలన్ పాత్ర చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా చేసింది. అటు నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించింది.
ఎక్కడా మంచు లక్ష్మికి కలిసి రాలేదు. ఇటీవల మంచు లక్ష్మి తన మకాం బాలీవుడ్ కి మార్చింది. ముంబై లో ఒక లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకుని నివసిస్తుంది. బాలీవుడ్ లో రాణించాలి అనేది ఆమె ప్రస్తుత లక్ష్యం అట. టాలీవుడ్ లో విఫలం చెందిన మంచు లక్ష్మి హిందీ చిత్ర పరిశ్రమలో ఈ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో పాటు బాలీవుడ్ ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల రకుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే…