https://oktelugu.com/

Anushka Shetty: బ్లాక్ బస్టర్ హిట్ అయిన అనుష్క డైరెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా?

తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు పొందారని తెలుస్తోంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 12, 2024 / 10:30 AM IST
    Follow us on

    Anushka Shetty: అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి.. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఒకప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదు అంటారు ఆమె ఫ్యాన్స్. కానీ కొన్ని రోజుల క్రితం ఆమె సినిమాల్లో నటించలేదు. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన స్వీటీ మరింత స్పీడ్ తో సినిమాలు చేస్తుంది. అయితే ఈమె ఒక సినిమాకు డైరెక్షన్ కూడా చేసిందట. ఏంటి అనుష్క డైరెక్టరా అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

    సూపర్ సినిమా ద్వారా టాలివుడ్ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఎవరు చేయని సాహసం చేస్తూ అరుంధతి సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఏ హీరోయిన్ కూడా ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని కోరుకోరు. కానీ అప్పట్లో అనుష్క నటిస్తున్నారనే విషయం తెలియడంతో అందరూ ఆమె చేస్తున్నటువంటి సాహసం ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు.

    కానీ అరుంధతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ల్ హిట్ అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా అనుష్క అరుంధతి సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇకపోతే అనుష్క అరుంధతి సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత అనుష్క పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగానే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు పొందారని తెలుస్తోంది. ఈమె ఓ సినిమాకు దర్శకత్వం వహించారని తెలిసి అందరూ ఆశ్యర్యపోతున్నారు.

    అనుష్క దర్శకత్వం వహించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే అరుంధతి సినిమా తర్వాత ఈమె భాగమతి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అప్పట్లో 40 కోట్లకు పైగా షేర్స్ రాబట్టాయి.అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగం అనుష్కనే దర్శకత్వం వహించారనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క ఈ సినిమాలో గోడకు చేతిని పెట్టి చేతిపై శిలా వేసే సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనుష్కని ఇచ్చారని తెలుస్తుంది. ఇక డైరెక్టర్ అందుబాటులో లేని సమయంలో ఈమె దర్శకత్వం వహించేవారట. ముఖ్యంగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నింటికీ కూడా అనుష్కనే డైరెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈమె డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట.