https://oktelugu.com/

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఆ ప్లాప్ డైరెక్టర్ మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ లో మెహర్ రమేష్ తనకు అత్యంత సన్నిహితుడని కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం విశేషం...మెహర్ రమేష్ ఎన్టీఆర్ హీరోగా 'కంత్రి ' అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 05:27 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు… తన ఎంటైర్ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్లను అందించిన ఈయన ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే… అయితే కొన్ని నెలల నుంచి ఈ సినిమాకి సంబంధించిన మేకోవర్ తను బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా మహేష్ బాబు అంబానీ ఇంట మ్యారేజ్ వేడుకలో కెమెరా కంటికి చిక్కడంతో ఆయన్ని చూసిన మహేష్ బాబు అభిమానులు ఆయన లుక్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో చేయబోయే సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. మొదటి నుంచి కూడా రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తే అది వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమా అయ్యేవిధంగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఉన్నాడు. కాబట్టి మీదట పాన్ ఇండియా సినిమా గా బాహుబలి చేసి, ఆ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ చేశాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబును ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక రకంగా చూసుకుంటే మహేష్ బాబు హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు. అందుకే రాజమౌళి ఆయనతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయనకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవారని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ లో మెహర్ రమేష్ తనకు అత్యంత సన్నిహితుడని కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం విశేషం…మెహర్ రమేష్ ఎన్టీఆర్ హీరోగా ‘కంత్రి ‘ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక అంతకంటే ముందే మహేష్ బాబు మీద ఉన్న ఇష్టంతో ‘బాబీ ‘ సినిమాలో ఆయన పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్లు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… గత కొన్ని రోజుల నుంచి వీళ్ళ కాంబో లో ఒక సినిమా వస్తుంది అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ మెహర్ రమేష్ ఎంటైర్ కెరియర్ లో తీసిన ఐదు సినిమాలు కూడా భారీ డిజాస్టర్లు గా మారడంతో ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ఆసక్తిని చూపించడం లేదు.

    కాబట్టి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు కూడా ఆయనతో సినిమా చేసే సాహసమైతే చేయలేదు… ఇక మొదటి నుంచి కూడా ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా ఒకరి విషయాలను మరొకరు షేర్ చేసుకుంటూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారట. ఇక ఇప్పటికి కూడా మహేష్ కు సంబంధించిన కొన్ని బిజినెస్ లను మెహర్ రమేష్ చూసుకుంటున్నాడట.

    ఇక ఈ విషయాన్ని స్వయంగా మెహర్ రమేష్ గారే తెలియజేయడం విశేషం… ఇక మొత్తానికైతే ప్రస్తుతం మెహర్ రమేష్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోగా మహేష్ బాబు మాత్రం పాన్ వరల్డ్ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వస్తున్న సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…