Gopichand: గోపీచంద్ ఆ సూపర్ హిట్ సినిమాను హాలీవుడ్ మేకర్స్ కాపీ చేశారనే విషయం మీకు తెలుసా..?

హాలీవుడ్ సినిమాలను కాపీ చేస్తూ మన మేకర్స్ కొన్ని సినిమాలను చేసి సక్సెస్ లను అందుకున్నారు. నిజానికి హాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాలను కాపీ చేస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు...

Written By: Gopi, Updated On : August 12, 2024 3:45 pm

Gopichand

Follow us on

Gopichand: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో నటులుగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో గోపీచంద్ ఒకడు. ఆయన మొత్తం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ సక్సెసులు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. అయినప్పటికీ ఆయన ఎక్కడ తడబడకుండా తను నమ్ముకున్న ఫార్మాట్లోనే ముందుకు సాగుతున్నాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన ‘ భీమా’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ప్రస్తుతం ఆయన శ్రీనువైట్ల డైరెక్షన్ లో చేస్తున్న విశ్వం సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి ఆయన కమర్షియల్ హీరోగా నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ శ్రీను వైట్ల తో చేస్తున్న సినిమాతో పాటు మరొక స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అయితే ఆ దర్శకుడు ఎవరు అనే దానిమీద సరైన క్లారిటీ లేదు. కానీ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ లో ‘టీజీ విశ్వప్రసాద్’ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక గోపీచంద్ 2007వ సంవత్సరంలో చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేసిన ఒక్కడున్నాడు సినిమా తెలుగులో ఆవరేజ్ గా ఆడినప్పటికీ ఆ సినిమాకి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. ఇక కల్ట్ క్లాసికల్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు కనక రిలీజ్ అయి ఉంటే భారీ సక్సెస్ ని అందుకునేది అంటూ చాలామంది తెలుగు సినిమా అభిమానులు చెబుతూ ఉంటారు. నిజానికి ఈ సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది డిఫరెంట్ వేలో ఉంది. వాళ్ళు కమర్షియల్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా పెద్దపీట వేస్తూ వచ్చారు. అలాగే గోపీచంద్ కూడా అంతకుముందు కమర్షియల్ సినిమాలను చేయడంతో ఇది కమర్షియల్ సినిమాకి కొంచెం భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనే చెప్పాలి.

సెలబ్రిటీల్లో కూడా ఈ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోశక్తి లేదు….ఇక ఇదిలా ఉంటే 2012 లో హాలీవుడ్ డైరెక్టర్ అయిన ‘అడ్రెయిన్ గున్బెర్గ్’ అనే దర్శకుడు ఈ సినిమా కథను కాపీ చేసి హాలీవుడ్ లో ‘గేట్ ద గ్రింగో’ అనే సినిమాను చేసి మంచు సక్సెస్ ను అందుకున్నాడు. ఇక్క ఆవరేజ్ గా నిలిచిన గోపీచంద్ సినిమా హాలీవుడ్ లో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఇంకా మన తెలుగు సినిమా స్టోరీ ని హాలీవుడ్ వాళ్లు కాపీ చేసి సక్సెస్ లను కొట్టే రేంజ్ కి అప్పట్లోనే మన ఇండస్ట్రీ ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…