Rajamouli: ఎప్పుడు కూల్ గా కనిపించే రాజమౌళి కి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

ఇండియాలో రాజమౌళి పేరు ఇప్పుడొక బ్రాండ్ అయింది. ఆయన గురించి మాట్లాడటానికి కానీ, ఆయన సినిమాలు చూడటానికి కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం చాలా ఆసక్తి గా ఉన్నారు...

Written By: Gopi, Updated On : July 24, 2024 12:01 pm

Rajamouli

Follow us on

Rajamouli: ఒక డైరెక్టర్ ఒక సినిమాను సక్సెస్ ఫుల్ గా తీయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే కథ విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో గాని ఏమాత్రం చిన్న తేడా జరిగిన కూడా సినిమా అనేది బోల్తా కొడుతుంది. కాబట్టి సినిమాను చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం రాజమౌళి తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు తో ఒక భారీ సినిమా కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడు చూసిన కూల్ గా కనిపించే రాజమౌళి కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపానికి కూడా గురవుతూ ఉంటాడట. అయితే ఆ కోపాన్ని మాత్రం బయట కనిపించే ప్రేక్షకులకు గాని, తన అభిమానులకు గాని ఇంతవరకు చూపించలేదు. ఇక తను ఏ పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చిన కూడా చాలా కూల్ గా వాళ్ల గురించి మాట్లాడి నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి రాజమౌళి ని చూస్తే ఆయనకి కూడా కోపం వస్తుందా? అనే డౌట్ మనలో చాలామందికి కలుగుతుంది. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకి విపరీతమైన కోపం వస్తుందట. ఎవరు ఏ పని సరిగ్గా చేయకపోయిన కూడా ఆయన విపరీతంగా అరుస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారని స్వయంగా తన భార్య అయిన రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇక మొత్తానికైతే రాజమౌళిని కంట్రోల్ చేయాలంటే అది రమా వల్ల మాత్రమే అవుతుందంటూ మరి కొంతమంది కూడా తెలియజేయడం విశేషం. సినిమా సెట్ లో తను అనుకున్న షాట్ అనుకున్నట్టుగా రాకపోతే ఆయన విపరీతంగా అరుస్తారట. నటీనటుల మీద కాకుండా తన డైరెక్షన్ టీం మీద మాత్రం విపరీతంగా అరుస్తూ ఎవరు ఏ పని సరిగ్గా చేయకపోయిన కూడా వారిని తిడతాడట. మరి అంత పెద్ద సినిమా చేసే సమయంలో ఎవరి వర్క్ ని వాళ్ళు సరిగ్గా చేస్తేనే కదా సినిమా అనేది సూపర్ గా వచ్చేది. అందువల్లే రాజమౌళి తన ఫ్రస్టేషన్ ను తన టీం మీద చూపిస్తూ ఉంటాడు. దీంట్లో తప్పేముంది అంటూ మరి కొంతమంది రాజమౌళికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.

ఇక మొత్తానికైతే ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త యాంగిల్ కూడా రాజమౌళి లో ఉందనే విషయం ఇప్పుడిప్పుడే బయటికి తెలుస్తుంది. నిజంగా ఎవరైన సరే రాజమౌళి సిచువేషన్ లో ఉంటే అలాగే అరుస్తారు. కానీ రాజమౌళి అలా చేయడు అని మనం అనుకోవడం కూడా చాలా తప్పే… ఎందుకంటే తను కూడా సినిమా విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వడు. కాబట్టి తనకు కూడా చాలా ప్రస్టేషన్స్ వస్తుంటాయి.

ఒకరోజు సినిమా షూటింగ్ ఆగిన కూడా కొన్ని లక్షల్లో నష్టమైతే వస్తుంది. కాబట్టి ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తెచ్చి పెట్టడం ఆయన స్ట్రాటజీ కాదు. వీలైనంతవరకు ప్రొడ్యూసర్స్ ని సేఫ్ జోన్ లోనే ఉంచుతూ ఉంటాడు. అందువల్లే తన పరిధిలో ఏదైనా తప్పు జరిగితే దాని మీద చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారంటూ మరి కొంత మంది ఆయన సన్నిహితులు కూడా ఈ విషయాలను తెలియజేయడం విశేషం…