Mohan Babu- Jaru Mitaya Bharatamma: ఒకప్పుడు జానపదాలు ప్రతి పల్లెలో వినిపించేవి. రాను రాను వాటికి ఆదరణ కరువవుతోంది. ఈ జనరేషన్ కి అవగాహన, ఆసక్తి లేకపోవడంతో జానపదాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఆ రోజుల్లో పల్లె జనాలు పనుల్లో అలసట మరిచేందుకు, వేడుకల్లో వినోదం కోసం వీటిని ఆలపించేవారు. వివాహం వంటి శుభకార్యాలతో పాటు ప్రతి సందర్భానికి కొన్ని ప్రత్యేక జానపదాలు ఉండేవి. అవి అంతరించి పోతున్న దశలో కొందరు దర్శక నిర్మాతలు తెరపైకి తేవడం అభినందించాల్సిన విషయం. తెలుగు సంస్కృతిలో భాగమైన ఈ పాటలు తెలిసిన మట్టిలో మాణిక్యాలను సినిమాల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు.

అలాంటి కొన్ని పాటలు విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. మంచు విష్ణు లేటెస్ట్ మూవీలోని ‘జారు మిఠాయా’ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు స్ఫూర్తి ఒక జానపద సాంగ్. ఆ ఒరిజినల్ సాంగ్ ని జిన్నా ప్రీ రిలీజ్ వేదికపై భారతమ్మ అనే మహిళ చేత పాడించారు. జారు మిఠాయా సాంగ్ ఆమెదే అని తెలుస్తుంది. భారతమ్మ పాడిన జారు మిఠాయా సాంగ్ విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను పాడిన జారు మిఠాయా సాంగ్ నేపథ్యం, అర్థం చెప్పారు. చిన్నప్పుడు మేకలు కాయడానికి పొలం వెళ్ళినప్పుడు ఈ పాటలు పాడుకునేవారట. జానపదాలు భారతమ్మ వాళ్ళ అమ్మవారి ఊళ్ళో నేర్చుకున్నారట. ఒక అమ్మాయికి జడవేసేటప్పుడు.. ”జడేస్తా జడేస్తా చూడు.. నచ్చకుంటే తీసేస్తా చూడు” అని పాడతారట. ”జంకలకిడి జారు మిఠాయా” అంటే అమ్మాయి పేరు అట. ఇక ”మొగ్గలకాలింక” అంటే నచ్చిన అబ్బాయి మన వంక చూడటం లేదని అర్థమట.

కాగా ఈ పాట పాడినందుకు జిన్నా చిత్ర నిర్మాత మోహన్ బాబు రూ. 50 వేలు ఇచ్చారట. అందుకు ఆమె వారికి ధన్యవాదాలు తెలిపారు. రెమ్యునరేషన్ అటుంచితే జిన్నా ప్రీ రిలీజ్ వేడుకలో పాడే అవకాశం ఇవ్వడం వలన ఆమె పాప్యులర్ అయ్యారు. ఎక్కడ చూసినా ఆమె పాటే వినిపిస్తుంది. భారతమ్మ గురించి తెలుసుకోవాలని నెటిజెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. భారతమ్మకు ఊహించని గుర్తింపు వచ్చింది