https://oktelugu.com/

Khadgam Movie: ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ క్యారెక్టర్ కోసం కృష్ణ వంశీ ముందుగా ఆ హీరోను అనుకున్నాడా..?

ఖడ్గం సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముగ్గురు లీడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 19, 2024 / 10:43 AM IST
    Follow us on

    Khadgam Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న క్యారెక్టర్లు మరొక హీరో చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కథ రాసుకునేటప్పుడు కథ రచయిత ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని ఆ కథని రాసుకుంటాడు. కానీ ఆ హీరోకి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఆ క్యారెక్టర్ ను ఆయన చేయలేకపోతే దానిని మరో హీరోతో చేయించాల్సి వస్తుంది.

    అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా తెరకెక్కిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ అప్పట్లో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందులో ముఖ్యంగా ఖడ్గం సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముగ్గురు లీడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ముందుగా శ్రీకాంత్ చేసే క్యారెక్టర్ కోసం కృష్ణవంశీ నాగార్జున ని తీసుకోవాలని అనుకున్నాడు.

    కానీ నాగార్జున అప్పుడు ఆ క్యారెక్టర్ లో ఒకటి రెండు చేంజెస్ చేయమని అడగగా కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ లో ఒక్క చేంజ్ కూడా చేయను అని చెప్పడంతో, నాగార్జున ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత కృష్ణవంశీ శ్రీకాంత్ తో ఆ క్యారెక్టర్ ను చేయించి సినిమాను సక్సెస్ చేశాడు. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ క్రేజ్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. నిజానికి శ్రీకాంత్ పోషించిన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ పాత్రని చేయడం అంటే మామూలు విషయం కాదు.

    కానీ శ్రీకాంత్ అలవోకగా ఆ క్యారెక్టర్ లో దూరిపోయి నటించి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ కి చాలా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమా ఒక దేశభక్తి సినిమాగా కూడా అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో కృష్ణవంశీ కూడా మరోసారి తన మార్క్ మేకింగ్ తో దుమ్మురేపాడు…