https://oktelugu.com/

Devara Movie: ఆ విషయం త్రిబుల్ ఆర్ ను ఫాలో అవుతున్న దేవర టీమ్…

ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీని కోసమే ఎక్కువ డేట్స్ కేటాయించి మరి ఈ సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 16, 2024 / 04:16 PM IST

    Devara team following RRR

    Follow us on

    Devara Movie: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా రూపొందించడానికి దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రతి ఒక్క సీన్ కూడా ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగేరుసుకునేలా ఉండబోతున్నాయని ఎన్టీఆర్ స్వయంగా ఒక ఈవెంట్ లో చెప్పడం విశేషం.. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీని కోసమే ఎక్కువ డేట్స్ కేటాయించి మరి ఈ సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఆ మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ ను ఇవ్వబోతుందంటూ సినిమా యూనిట్ అయితే సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని గ్రాఫికల్ షాట్స్ కూడా ఉన్నాయట. వాటిని ఎన్టీఆర్ దగ్గరుండి మరి చూసుకుంటూ వాటిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేసే విధంగా దర్శకుడు తో పాటు ఎన్టీఆర్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అవి బాగా రాకపోతే మళ్ళీ చేద్దాం అనే ఉద్దేశ్యం లో ఉన్నారు తప్ప ఏదో ఒకటి సర్దేద్దాం అనే ఉద్దేశ్యం లో అయితే సినిమా యూనిట్ లేరట.

    అందువల్లే సినిమా ప్రోడక్ట్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా వస్తున్నప్పటికీ సినిమా మాత్రం చాలా లేట్ అవుతూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా ఒక లిరికల్ సాంగ్ ను అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సాంగ్ లోనే సినిమా స్టోరీ మొత్తాన్ని నిగూఢమైన అర్థం వచ్చేలాగా రాశారట.

    అంటే ఆ పాటను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సినిమా స్టోరీ మనకు మొత్తం తెలిసిపోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక హింట్ అయితే వస్తుంది. ఇక ఇంతకు ముందు ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాలో దోస్తీ సాంగ్ ను కనక మనం అబ్జర్వ్ చేస్తే అందులో ఈ ఇద్దరి హీరోల మధ్య గొడవ రాబోతుంది అనే విధంగా లిరిక్స్ ను రాశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా అలాంటి పద్ధతినే ఎంచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…