Rajamouli: తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మరి రాజమౌళి తరువాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరు ? ఆ ప్లేస్ కోసం కొరటాల, త్రివిక్రమ్ లాంటి కొంతమంది పోటీ పడుతున్నా.. కొరటాలదే పై చేయి. కారణం కొరటాల సినిమాల ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమా అవుట్ ఫుట్ కూడా అద్భుతంగా వచ్చింది అంటున్నారు.

అయితే, విచిత్రంగా కొరటాల పై బాలీవుడ్ జనాలు సైతం ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. అదేంటి ? కొరటాల ఇంతవరకు హిందీ సినిమా చేయలేదు కదా ? పైగా కొరటాలకు హిందీ కూడా రాదు. మరి హిందీ ప్రేక్షకులు ఎందుకు అతని పై ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు ?. కారణం.. డబ్బింగ్ సినిమాలే. కొరటాల ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఆ సినిమాలను హిందీలోకి కూడా డబ్ చేశారు.
దాంతో కొరటాల శివ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా కొరటాల సినిమాల్లో ఉండే సామాజిక అంశం హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎవరు ఈ డైరెక్టర్ ? అంటూ కొరటాల గురించి ఆరా తీస్తున్నారు. పైగా ఆచార్య సినిమా గురించి హిందీ ప్రేక్షకుల్లో కూడా కొంతవరకు ఆసక్తి ఉంది. థియేటర్ కి వచ్చి సినిమా చూడకపోయినా.. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై డబ్బింగ్ వెర్షన్ ను మాత్రం కచ్చితంగా చూస్తారు.
మొత్తానికి కొరటాల డైరెక్షన్ స్కిల్ కి దక్కిన గౌరవం ఇది. ఇక కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు కూడా. ఇది పాన్ ఇండియా సినిమా అట. ఒకపక్క ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేయబోయే రికార్డ్స్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమా హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టేలా ఉంది.
కాబట్టి.. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కొరటాలదే. ఎలాగూ కొరటాల హిస్టరీలో ఒక్క ప్లాప్ కూడా లేదు కాబట్టి.. కొరటాల – ఎన్టీఆర్ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక వీరి కలయికలో రాబోతున్న సినిమా గొప్ప యాక్షన్ డ్రామాగా ఉంటుందట. అందుకే , ఒక్క సినిమా కూడా హిందీలో చేయకుండానే కొరటాలకు పాన్ ఇండియా లెవల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.