Bigg Boss 5 Telugu: బుల్లితెరలో దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున వరుసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఇంకొక 55 రాజోలు మిగిలి ఉన్న ఈ షో లో ప్రతి వారం ఏదోకటి జరగొచ్చు. గేమ్ ముందుకు సాగాలంటే ప్రతి వారం ఏదొక కంటెస్టెంట్ నామినేట్ అవ్వాల్సిందే… ఆదివారం ఎలిమినేట్ అవ్వాల్సిందే. అలా ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ ఏడు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

మొదటి వారం నుండి ఇప్పటి వరకు సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా… అలా వరుసగా ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నిన్న (సోమవారం) జరిగింది. నిన్న జరిగిన ఆ ప్రక్రియలో మొత్తం ఆరుగురు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. ఆ లిస్ట్ లో షణ్ముఖ్ జస్వంత్, మానస్, రవి, సిరి, శ్రీరామా చంద్ర, లోబో ఉన్నారు.
వరుసగా ఎనిమిదోసారి: ప్రతి వారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ లో కొందరు సేవ్ అవుతుంటారు.. మరి కొందరు నామినేట్ అవుతుంటారు. అలా ప్రతివారం అంటే వరుసగా ఎనిమిదో సారి యాంకర్ రవి నామినేట్ అయ్యాడు. బిగ్ బాస్ మొదలయ్యి వరుసగా యాభై రోజులు అయ్యేసరికి హౌస్ మేట్స్ అందరికి ఎవరిని సేవ్ చేయాలి అనే విషయం మీద పూర్తిగా క్లారిటీ వచ్చింది. నచ్చిన కంటెస్టెంట్ ని సేవ్ చేసుకుంటున్నారు. నచ్చని వాళ్ళని నామినేట్ చేసి నిర్ధాక్షణ్యంగా బయటకు పంపిస్తున్నారు.
అయితే నామినేషన్స్ లో ముందుగా గుర్తొచ్చే పేరు యాంకర్ రవి. ఎందుకంటే రవి కి బయట మంచి క్రేజ్, పేరు ఉంది. తనని నామినేట్ చేసిన సులభంగా సేవ్ అవుతాడనే నమ్మకం తో హౌస్ మేట్స్ అందరూ రవి ని సాఫ్ట్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా కూడా వరుసగా 8వ సారి నామినేట్ అయి రికార్డులు తిరగరాస్తున్నాడు యాంకర్ రవి. సేవ్ అవుతున్నాడు కదా అని ప్రతీవారం నామినేషన్స్‌లోకి పంపిస్తూ ఉంటే ఎలా అంటూ రవి ఫాలోయర్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మరి కనీసం వచ్చే వారమైనా రవి నామినేషన్స్ నుంచి తప్పించుకుంటాడా లేదా అనేది చూడాలి.