Jai Bhim: తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జై భీమ్. టి. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా చూసిన తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు. ఇందులో సూర్య నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురింపిస్తున్నారు. 1993లో తమిళనాడులో గిరిజన మిళ తరఫున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తాజాగా, ఈ సినిమాపై సీపీఐ జాతీయ కార్యర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. జై భీమ్ సినిమా తన జీవితంలో జరిగిన ఘటనలను గుర్తుచేస్తుందని తెలిపారు. నిత్యం సమాజంలో జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని బలంగా అందరి కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు నారాయణ.
ఈ సినిమాలోకి ఒక ఘట్టానికి తనకు అవినాభావ సంబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. 37 ఏళ్ల కిందటి ఘటన తన కళ్లముందు కదలాడిందని అన్నారు. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఎలాగైనా ఉపసంహరింప చేయాలని పోలీస్.. నీ భర్త ఎటు రాడు కనీసం పరిహారం అందుకొని కోర్టు కేసు ఉపసంహారించుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు దిమ్మతిరిగేలా ఉంటుందని.. ఈ క్రమంలోనే తను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా వుండగా తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చిందని నారాయణ అన్నారు. సూర్య, జ్యోతిక జంటక సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది.