Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Comedy Villain Raghu: కామెడీ విలన్ రఘుకి ఇంత క్యూట్ డాటర్స్ ఉన్నారా... చూస్తే ఆశ్చర్యపోతారు!

Comedy Villain Raghu: కామెడీ విలన్ రఘుకి ఇంత క్యూట్ డాటర్స్ ఉన్నారా… చూస్తే ఆశ్చర్యపోతారు!

Comedy Villain Raghu: మొదటి చిత్రంతోనే పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రఘు కారుమంచి. కామెడీ విలన్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశాడు. రఘు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నటనపై మక్కువతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. దర్శకుడు వివి వినాయక్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దాంతో ఆది మూవీలో రాజీవ్ కనకాల ఫ్రెండ్ రోల్ ఆఫర్ చేశాడు. ఆది మూవీలో తప్పు చేసిన కాలేజ్ స్టూడెంట్స్ ని హీరో ఎన్టీఆర్ ఇరగ్గొడతాడు. ఈ ఫైట్ లో రఘు కారుమంచి కామెడీ బాగుంటుంది.

‘ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా, ఎండి పోయింది’ అని రఘు చెప్పే డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్. ఆది మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రఘు కారుమంచి చిన్న పాత్రతో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కి కూడా రఘు సన్నిహితుడు. వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో రఘు కి ఓ పాత్ర ఉండేది. అలాగే వివి వినాయక్ సైతం రఘుకి తన సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చేవాడు.

Comedy Villain Raghu
Comedy Villain Raghu

వివి వినాయక్ తెరకెక్కించిన దిల్, ఠాగూర్, యోగి, అదుర్స్ చిత్రాల్లో రఘు మంచి పాత్రలు చేశాడు. హిందీలో కూడా రఘు నటించాడు. 2013లో ప్రయోగాత్మకంగా మొదలైన జబర్దస్త్ షోలో రఘు టీమ్ లీడర్ గా పార్టిసిపేట్ చేశాడు. రోలర్ రఘు ఆయన టీమ్ నేమ్. కొన్నాళ్ళు జబర్దస్త్ లో ఉన్న రఘు బయటకు వచ్చేశాడు. సినిమాల మీద ఫోకస్ చేశాడు. ఈ మధ్య రఘుకి ఆఫర్స్ తగ్గాయి. ఆయన అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు.

రఘుకి టీనేజ్ దాటిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరి ఫోటోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రఘు తన ఇద్దరు కూతుళ్లతో పాటు ఎన్టీఆర్ తో ఫోటో దిగారు. ఎన్టీఆర్ గెటప్ ని బట్టి అది జై లవకుశ సెట్ అని తెలుస్తుంది. రఘు కూతుళ్లను చూసిన నెటిజెన్స్… ఆయనకు ఇంత అందమైన క్యూట్ డాటర్స్ ఉన్నారా? అని కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య రఘు ఓ మద్యం షాపు కౌంటర్ లో కనిపించాడు. ఆయన వీడియో వైరల్ అయ్యింది. తెలంగాణాలో ఒకటి రెండు మద్యం దుకాణాలు టెండర్లు పాడినట్లు అనంతరం రఘు వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular