Chiranjeevi: కొంతమంది స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తారు. ఇక చిరంజీవి కూడా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ తన డాన్సులతో, ఫైట్లతో అప్పుడున్న ప్రేక్షకులందరిని కట్టిపడేసేవాడు. ఇక దాంతో ఆయన మెగాస్టార్ గా అవతరించాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన కమర్షియల్ సినిమాల్ని చాలా సంవత్సరాల పాటు ఏలుతూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తాడు, ఆర్ట్ ఫిల్మ్స్ చేయలేడు అనే ఒక అపవాదు అయితే చిరంజీవి మీద ఉండేది.
ఇక దాంతో తను కూడా ఆర్ట్ ఫిలిమ్స్ చేయాలనే ఉద్దేశ్యంతో కె విశ్వనాథ్ డైరెక్షన్ లో ఆపద్భాందవుడు, స్వయంకృషి(Swayam Krushi) అనే సినిమాలు చేశాడు. వీటిలో స్వయంకృషి సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఆపద్బాంధవుడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునేదే కానీ అందులో చిరంజీవి తన ఇమేజ్ ను తగ్గించుకొని కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఆ సినిమాను చూసిన మెగా అభిమానులకు అది పెద్దగా నచ్చలేదు. ఇక ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక దానికి తోడుగా బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన రుద్రవీణ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
ఎందుకంటే చిరంజీవి కమర్షియల్ సినిమాల హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా కావడం, అందులో ఎలాంటి ఫైట్లు లేకుండా నార్మల్ గా ఉండటం. అలాగే ఈ సినిమా ప్లాట్ పాయింట్ సింపుల్ గా ఉండటం. ఇక చిరంజీవి అప్పటి వరకు అలాంటి సాఫ్ట్ పాత్రల్లో నటించకపోవడం వల్ల ఆయన అభిమానులు ఆ క్యారెక్టర్ లో చిరంజీవి ని చూడలేకపోయారు. దానివల్లే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. చిరంజీవి ఈ సినిమాల్లో అద్భుతమైన నటనని కనబరిచాడు. అంతకుముందు కమర్షియల్ సినిమాల్లో ఎలాంటి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడో, దానికి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో నటించాడు కానీ ఇవి మాత్రం ఆయనకు పెద్దగా సక్సెస్ సాధించి పెట్టలేదు.
ఇక దాంతో కమర్షియల్ సినిమాలే బెటర్ అని అనుకున్న చిరంజీవి వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే ఈ సినిమాలు ఆయన ఇమేజ్ ను దెబ్బతీశాయని చాలా మంది సినిమా విమర్శకులు సైతం ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు…