Waltair Veerayya Tittle Teaser: చిరంజీవి అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ చేసి చాలా కాలం అవుతుంది. వింటేజ్ చిరంజీవిని చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ అభిరుచి మేరకు సినిమాలు ఎంచుకునే చిరంజీవి వాళ్ళ కల నిజం చేశారు. మెగా 154తో ఊర మాస్ ట్రీట్ ఇచ్చారు. దీపావళి కానుకగా విడుదలైన మెగా 154 మూవీ టైటిల్, టీజర్ అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ముఖ్యంగా చిరంజీవి గెటప్ ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు చిత్రాలను గుర్తు చేసింది. ప్రచారం జరిగినట్లు ‘వాల్తేరు వీరయ్య’ గా టైటిల్ నిర్ణయించారు. ఇక రెండున్నర నిమిషాల టీజర్ ఫ్యాన్స్ బ్లడ్ బాయిల్ చేసింది.

నోట్లో బీడీ, చెవికి పోగు,మెడలో చైన్లు, లుంగీ కట్టులో చిరంజీవి మాస్ లుక్ మెస్మరైజ్ చేసింది. వాల్తేరు వీరయ్య టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దశాబ్దాల తర్వాత చిరంజీవి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. టీజర్లో చిరంజీవి చెప్పిన ” ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాల్తేరు వీరయ్య” డైలాగ్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. టీజర్ చివర్లో రవితేజ చిరంజీవి ఫ్యాన్స్ కి దివాళి విషెస్ తెలియజేశారు. ఫ్యాన్స్ కి చిరు దీపావళి ట్రీట్ అదిరింది.
వైజాగ్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి నుండి అభిమానులు ఆశించే కామెడీ, రొమాన్స్, యాక్షన్, మేనరిజమ్స్ కలగలిపి ఫుల్ మీల్ లాంటి సినిమా ఆయన సిద్ధం చేస్తున్నట్లు టీజర్ తో హింట్ ఇచ్చేశాడు. ఇక విడుదల తేదీ కూడా కంఫర్మ్ చేశారు. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. టీజర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకున్న మరొక ప్రత్యేకత మాస్ మహరాజ్ రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర ఎలా ఉంటుందనే ఆత్రుత నెలకొంది. ఎప్పుడో అన్నయ్య సినిమాలో రవితేజ ఆయన తమ్ముడిగా నటించారు. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.