Upasana: అందుకే పిల్లల్ని కనడం ఆలస్యం అయ్యింది… షాకింగ్ మేటర్ రివీల్ చేసిన చరణ్ వైఫ్ ఉపాసన!

Upasana ఉపాసన దంపతులు ఆలస్యంగా తల్లిదండ్రులు కావడం వెనుక కారణం ఏమిటో ఉపాసన తెలియజేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. అమ్మ కావడం గొప్ప విషయంగా అందరూ భావిస్తారు.

Written By: Gopi, Updated On : February 7, 2024 9:51 am

Upasana

Follow us on

Upasana: మెగా కోడలు ఉపాసన తాజా ఇంటర్వ్యూలు పలు వ్యక్తిగత విషయాల మీద స్పందించారు. పిల్లల్ని కనడానికి ఎందుకు ఆలస్యం అయ్యిందో చెప్పుకొచ్చారు. హీరో రామ్ చరణ్ ని ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. స్నేహంగా మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఉపాసన-రామ్ చరణ్ తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. 2012లో అత్యంత ఘనంగా ఉపాసన-రామ్ చరణ్ వివాహం జరిగింది.

అయితే ఏళ్లు గడుస్తున్నా ఉపాసన తల్లి కాలేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ దంపతులు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు దాదాపు పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చారు. 2022 డిసెంబర్ లో ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 2023 జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి క్లిన్ కార అని పేరు పెట్టారు.

అయితే ఉపాసన దంపతులు ఆలస్యంగా తల్లిదండ్రులు కావడం వెనుక కారణం ఏమిటో ఉపాసన తెలియజేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. అమ్మ కావడం గొప్ప విషయంగా అందరూ భావిస్తారు. నేను డబుల్ గ్రేట్ అనుకుంటాను. పిల్లల విషయంలో మేము విమర్శలు ఎదుర్కొన్నాము. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏమైనా లోపం ఉందా? అని అడిగారు. అయితే నేను, రామ్ చరణ్ పూర్తిగా సన్నద్ధం అయ్యాకే పిల్లలను పొందాలి అనుకున్నాము, అని ఆమె అన్నారు.

పిల్లల్ని కనడం, వాళ్లను పెంచడం పెద్ద బాధ్యత. అన్ని విధాల పర్ఫెక్ట్ అనుకున్నాక ఫ్యామిలీ ప్లానింగ్ చేశామని ఉపాసన క్లారిటీ ఇచ్చారు. కాగా క్లిన్ కార నాన్న కుచ్చి అట. రామ్ చరణ్ దగ్గరకు వెళితే కనురెప్పలు ఆడిస్తుందట. నవ్వుతుందట. ఈ విషయంలో నేను ఈర్ష్యగా ఫీల్ అవుతున్నానని ఉపాసన చెప్పుకొచ్చింది. ఉపాసన బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంటే… రామ్ చరణ్ స్టార్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు.