Bigg Boss Season 6- Mohana Bhogaraju: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్–6 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే లోగో,టీజర్‌ను విడుదల చేశారు. ఇవి షోపై అంచనాలను పెంచేసాయి. ఇదిఇలా ఉంటే ఈసారి షోలో ఎవరు పాల్గొనబోతున్నారు? ఏ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఈసారి ఎంటర్‌టెయిన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాల మేరకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు కూడా షోలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

లిస్ట్ రెడీ..
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన లిస్టును షో నిర్వాహకులు ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండ్ ఇస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి అన్నది కూడా ముందుగానే ప్లాన్ చేశారట. తాజా సమాచారం ప్రకారం… బిగ్ బాస్ రివ్యూయర్స్ ఆదిరెడ్డి, గీతు రాయల్, జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, శ్రీసత్య, దీపిక పిల్లి, అర్జున్ కళ్యాణ్, యాంకర్ ఆరోహిరావు, వాసంతి కృష్ణన్, అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.సనియర్ యాంకర్ ఉదయభానుకి కూడా బిగ్‌బాస్ హౌస్ నుంచి పిలుపు రాగా ఆమె ఇంతవరకు తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఆర్జే.సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇయనసుల్తానా, అప్పారావు, తన్మయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

సింగర్‌కు చాన్స్..
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజన్ –6లో ఈ సారి ఫీమేల్ సింగర్‌కు అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతంలో మేల్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ఫోలో ఫీమేల్ షోలోకి రాలేదు. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ఫిమేల్ సింగర్ కోసం సెర్చ్ చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో చలాకీగా ఉండడంతోపాటు షోను రక్తికట్టించేలా ఉండాలని, అందంగా కూడా ఉండాలని పలువురిని సెర్చ్ చేసి చివరకు బుల్లెట్లు బండి సాంగ్‌తో ఫేమస్ అయిన మోహన భోగరాజుని తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె డైరెక్ట్ గా ఎంట్రీ లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం మోహన భోగరాజు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ షో నిర్వాహకులు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.


[…] […]