Pallavi Prashanth: పొలం పనులు చేసుకునే పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డ ట్యాగ్ తో అడుగుపెట్టి టైటిల్ కొట్టాడు. సామాన్యుడు తలచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాగా ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. స్వయంగా పల్లవి ప్రశాంత్ ఈ విషయాన్నివెల్లడించాడు. దాంతో చర్చ మొదలైంది.
ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరైన ప్రశాంత్ ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ పై ఆసక్తిని బయట పెట్టాడు. ప్రజలు సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్ గా ప్రిన్స్ యావర్ నటించిన ఓ స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్ కి పల్లవి ప్రశాంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ .. మనల్ని మనం నమ్ముకోవాలి, అలాగే దేవుడు ని కూడా నమ్ముకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు కాపాడతాడు.
మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను .. అందుకే మీ ముందు ఇలా నిలబడ్డాను.మీ అందరి సపోర్ట్ వలనే బిగ్ బాస్ టైటిల్ గెలిచాను. రైతు బిడ్డ తలచుకుంటే ఏదైనా సాధిస్తాడని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇంతలో శివాజీ మైక్ తీసుకుని పార్లమెంట్ కి కూడా వెళ్తాడని, పల్లవి ప్రశాంత్ ని ఉద్దేశించి అన్నాడు. మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుందన్నాడు.
యువత మేల్కోవాలి, ముందుకు రావాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటలని బట్టి చూస్తుంటే జనాలు సపోర్ట్ చేస్తే పాలిటిక్స్ లో కి రావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే తన రీల్స్ కి సీఎం రేవంత్ రెడ్డి పాటలు జోడించి హైప్ ఇచ్చుకుంటున్నాడు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏదో ఒక పొలిటికల్ పార్టీ తరపున లేదంటే ఇండిపెండెంట్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికల బరిలో దిగుతాడేమో చూడాలి…