https://oktelugu.com/

Bigg Boss Priyanka Singh: బాత్ టబ్ లో స్నానం చేస్తూ వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్

బిగ్ బాస్ హౌస్ లో ఒక పాజిటివ్ ఇమేజ్ తో 13 వారాలు రాణించగలిగింది. ఒక ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుని అన్ని వారాలు హౌస్ లో ఉండగలగడం ప్రియాంక కే సాధ్యమైంది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 5, 2024 / 09:54 AM IST
    Follow us on

    Bigg Boss Priyanka Singh: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ అందరికీ సుపరిచితమే. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సింగ్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అందం, గ్లామర్ మైంటైన్ చేయడంలో ఎవరైనా ప్రియాంక తర్వాతే అనిపించుకుంది. సీరియల్ నటుడు మానస్ తో లవ్ ట్రాక్ కూడా నడిపింది. ప్రియాంక, మానస్ ని చాలా ప్రేమించింది. కానీ మానస్ ఆమెను మంచి ఫ్రెండ్ గా చూశాడు. ప్రియాంక మానస్ చుట్టే తిరుగుతూ క్లోజ్ గా ఉండేది. అతన్ని ఇష్టపడుతుందని తెలిసి మానస్, ప్రియాంకను దూరం పెట్టాడు.

    బిగ్ బాస్ హౌస్ లో ఒక పాజిటివ్ ఇమేజ్ తో 13 వారాలు రాణించగలిగింది. ఒక ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుని అన్ని వారాలు హౌస్ లో ఉండగలగడం ప్రియాంక కే సాధ్యమైంది. బిగ్ బాస్ కి వెళ్లక ముందు ప్రియాంక సింగ్ జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయింది. చాలా కాలం జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో పాల్గొంది. ఈ రియాలిటీ షో వలన ప్రియాంక లైఫ్ మారిపోయింది. షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించింది.

    హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మాలో ప్రసారమైన పలు షోలు, ఈవెంట్లలో ప్రియాంక సందడి చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ సంపాదించింది. నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్ టిప్స్.. షాపింగ్, హోమ్ టూర్ వీడియోలు పోస్ట్ చేస్తుంది.

    తాజాగా ప్రియాంక పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది. ప్రియాంక చేసిన పనికి జనాలు షాక్ అవుతున్నారు. బోల్డ్ వీడియో షేర్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ప్రియాంక సింగ్ స్నానం చేస్తున్న వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ట్రాన్స్ జెండర్ నుండి ఇది ఊహించని తెగింపు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.