https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం ఇదే… బిగ్ బాస్ మాటల్లో!

పల్లవి ప్రశాంత్ .. మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ హోదాలో ఇంట్లో అడుగు పెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2023 / 11:20 AM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫినాలే వీక్ లో భాగంగా టాప్ 6 కంటెస్టెంట్స్ కోసం జర్నీ వీడియోలు విడుదల చేస్తున్నారు బిగ్ బాస్. కాగా ఇప్పటికే హౌస్ లో ఉన్న ఆరుగురిలో అర్జున్, అమర్, శివాజీ, ప్రియాంక ల జర్నీ వీడియోలు చూపించారు. ఇక నేడు యావర్, ప్రశాంత్ ల బిగ్ బాస్ ప్రయాణం చూపించబోతున్నారు. ఇందుకు సంబంధిన ప్రోమో మాములుగా లేదు. ప్రశాంత్ ని బాగా ఎలివేట్ చేశారు బిగ్ బాస్. రైతు బిడ్డ ని ఆకాశానికి ఎత్తేసాడు బిగ్ బాస్.

    పల్లవి ప్రశాంత్ .. మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ హోదాలో ఇంట్లో అడుగు పెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. టాస్కుల్లో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. మీకు ఇక్కడ వివిధ వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కుంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ .. మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేసి .. ఏడుపు సమాధానం కాదని ఆ స్నేహమే తెలియజేసింది.

    నామినేషన్ లో మీలోని మరో ప్రశాంత్ ని అందరికీ చూపించి .. ఓ బలమైన పోటీ దారుడిగా నిలిచి .. ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే .. దాన్ని ఒడిసి పట్టే నైపుణ్యం విజయం అంటూ బిగ్ బాస్ చెప్పారు.

    దీంతో ప్రశాంత్ నోట మాట రాక కన్నీరు పెట్టుకున్నాడు. ప్రోమో చూసిన ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కుష్ అయిపోతున్నారు. ప్రశాంత్ టైటిల్ విన్నర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో మూడు రోజుల్లో విన్నర్ ఎవరో తెలియనుంది. అయితే ప్రశాంత్,శివాజీ, అమర్ దీప్ ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి. అలాగే ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నట్లు సమాచారం. అతడు టైటిల్ విన్నర్ అంటూ ప్రచారం జరుగుతుంది.