https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: శివాజీని హౌస్ నుండి పంపేసిన బిగ్ బాస్… ఎలిమినేట్ కాకుండా ఇదేం ట్విస్ట్!

పల్లవి ప్రశాంత్, యావర్ వంటి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా ఉంటూ శివాజీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి వారం కొంచెం తడబడినా నిలదొక్కుకున్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : October 16, 2023 / 02:46 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 ఊహించని ట్విస్ట్స్ తో సాగుతుంది. నటుడు శివాజీని ఎలిమినేషన్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపేశాడు. పల్లవి ప్రశాంత్ తో పాటు హౌస్ మేట్స్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. శివాజీ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇప్పటివరకు చూస్తే అతడే టైటిల్ ఫేవరెట్. వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చే వరకు సీరియల్ బ్యాచ్-శివాజీ బ్యాచ్ అంటూ హౌస్ నడిచింది. సీరియల్ బ్యాచ్ కి శివాజీ గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు.

    పల్లవి ప్రశాంత్, యావర్ వంటి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా ఉంటూ శివాజీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి వారం కొంచెం తడబడినా నిలదొక్కుకున్నాడు. అప్పుడప్పుడు శివాజీ సహనం కోల్పోతాడు. అది మైనస్ అని చెప్పాలి. గేమ్స్ పరంగా కూడా సత్తా చాటుతున్నాడు. రెండో పవర్ అస్త్ర గెలిచిన శివాజీ మూడు వారాల ఇమ్యూనిటీ పొందాడు. ఫస్ట్ కెప్టెన్సీ రేసులో కూడా చివరి వరకు వచ్చాడు.

    అయితే పల్లవి ప్రశాంత్ కి త్యాగం చేసి రేసు నుండి తప్పుకున్నాడు. తాను ప్రోత్సహించిన పల్లవి ప్రశాంత్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. మరి అలాంటి శివాజీని బిగ్ బాస్ ఎందుకు బయటకు పంపేశాడనే చర్చ మొదలైంది. శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ మీరు బయటకు వెళ్లిపోండి అన్నాడు. బిగ్ బాస్ కి దండం పెట్టి శివాజీ బయటకు వచ్చేశాడు. శివాజీ వెళ్లకుండా ఆపేందుకు హౌస్ మేట్స్ ట్రై చేశారు. అయినా శివాజీ వినలేదు.

    కాగా ఆరోగ్య కారణాలతో శివాజీ బయటకు వచ్చాడని, మరలా రీ ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది. వైల్డ్ కార్డు ద్వారా హౌస్లో అడుగుపెట్టిన నయని పావని కేవలం ఒక వారంలోనే ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం. నయని ఎలిమినేషన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.