Balayya and Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా నేపద్యంలో సినిమాలను చేస్తున్నారు.సీనియర్ హీరోలైన బాలయ్య బాబు, వెంకటేష్ లాంటి నటులు సైతం వైవిద్య భరితమైన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…అప్పట్లో బాలయ్య – వెంకటేష్ ఇద్దరు ఒకే కథతో సినిమా చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘అశోక చక్రవర్తి’ సినిమా 1989వ సంవత్సరం జూన్ 29న రిలీజ్ అయింది. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా సైతం 1989 జూన్ 29న రిలీజ్ అవ్వడం విశేషం…ఈ రెండు సినిమాల్లో వెంకటేష్ చేసిన ధ్రువ నక్షత్రం సినిమా సక్సెస్ అయింది… అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఈ రెండు సినిమాలు కూడా ఒకే కథ తో తెరకెక్కాయి.
అసలు మ్యాటర్ లోకి వెళ్తే మలయాళం లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘ఆర్యన్’ సినిమాకి రీమేక్ గా ‘అశోక చక్రవర్తి’ సినిమా వస్తే, ఫ్రీమేక్ గా ‘ధ్రువ నక్షత్రం’ సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల కథలు ఒకటే, ఈ రెండు మూవీస్ కి పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడం విశేషం…వాళ్ళకి ఈ మూవీస్ కథలు ఒక్కటే అని తెలిసినప్పటికి వాళ్లు ఎవరికి చెప్పకుండా అక్కడ ఆ సినిమాకి డైలాగులు రాశారు.
ఇక్కడ ఈ సినిమాకి డైలాగులు రాశారు. ఫైనల్ గా సినిమాలు రెండు రిలీజ్ అయిన తర్వాత రెండు మూవీస్ ప్రొడ్యూసర్లు, దర్శకులు రెండు సినిమాల కథలు ఒకటే కదా మీరు రెండింటికి మాటలు రాసినప్పుడు ఎందుకని మాకు చెప్పలేదు అని పరుచూరి వాళ్ళను అడిగినప్పటికీ ఆ రైటర్ల దగ్గర సమాధానం లేకపోయింది.
మొత్తానికైతే పరుచూరి బ్రదర్స్ చెప్పకపోవడం వల్ల సినిమా నిర్మాతలు కొంతవరకు వాళ్ల మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది… నిజానికి రెండు సినిమాల కథలు ఒకటైనప్పటికి వాళ్ళు ఓపెన్ గా చెప్తే బాగుండేది. ఎవరో ఒకరు కంప్రమైజ్ అయి సినిమాని చేయకుండా ఆపేసేవారు. ఇలా రెండు సినిమాలు ఒకే కథతో రావడం, ఆ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల రెండు సినిమాల మీద కూడా భారీ ఎఫెక్ట్ పడింది…