Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతు ఉంటారు. అయితే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీలో తనదైన రీతిలో తన స్టామినాని చూపిస్తూ వరుస సక్సెస్ లను చేస్తూ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ కూడా సూపర్ సక్సెస్ లు అందుకుంటూ నందమూరి ఫ్యామిలీ బరువు, బాధ్యతల్ని మోసుకుంటూ వస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు. కానీ ఒక్క సినిమాను మిస్ చేసుకున్నందుకు మాత్రం ఆయన ఇప్పటికీ చాలా వరకు బాధపడతదట..అది ఏ సినిమా అంటే తమిళం లో రజినీకాంత్(Rajinikanth) హీరోగా రమ్యకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘నరసింహ'(Narasimha) సినిమా…
అయితే స్టోరీ రైటర్ అయిన చిన్నికృష్ణ ఈ కథను ముందుగా బాలకృష్ణ కి చెప్పారట. కానీ అప్పుడు బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలో బిజీగా ఉండడం వల్ల నరసింహా సినిమాను చేసే అవకాశం అయితే రాలేదు. ఇక దాంతో ఆ సినిమాను తమిళ్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఇందులో రజనీకాంత్ ను హీరోగా పెట్టి ఆ సినిమా చేశారు. ఇక దాంతో ఆ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే బాలయ్య ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ చాలా బాధపడతారట. నిజానికి ఆ క్యారెక్టర్ లో బాలయ్య కూడా అద్భుతంగా సెట్ అయ్యేవాడు.
ఇక రమ్యకృష్ణ ను ఎదుర్కోవడానికి బాలయ్య కూడా తనదైన విశ్వరూపాన్ని చూపించేవాడు అంటూ బాలయ్య అభిమానులు కూడా ఆయన ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు విపరీతంగా బాధపడుతున్నారట..ఇక మొత్తానికైతే ఇలాంటి ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడం బాలయ్య బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇక దానికి తోడు గా ఆయన కూడా ఇలాంటి ఒక స్టైలిష్ రోల్ లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసేవాడు…ఇక మొత్తానికైతే రజనీకాంత్ ఆ క్యారెక్టర్ లో మంచి పర్ఫామెన్స్ ను ఇస్తు తన ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను వేసుకున్నాడు…