https://oktelugu.com/

Balakrishna: ఫహాద్ ఫాజిల్ ‘ ఆవేశం ‘ సినిమాను రీమేక్ చేస్తున్న బాలయ్య… ఇందులో ఎంత వరకు నిజం ఉంది…

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు వరుసగా రీమేక్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటారు. అందుకే ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే మొదటగా మన హీరోలు ఆ దర్శకులనే సంప్రదిస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 6, 2024 / 12:19 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహాం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా అది ఒక సంచలనంగా మారుతుందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఆయన మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణను చొరగొంటున్నాడు. అలాగే ఆయన పౌరాణిక పాత్రలను కూడా పోషించాడు. ముఖ్యంగా ఆయన ‘శ్రీరామరాజ్యం ‘ సినిమాలో రాముడి పాత్రను చేసి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్ల నాన్న అయిన ‘నందమూరి తారక రామారావు’ గారిని గుర్తు చేశాడు అంటూ ప్రతి ఒక్క ఆడియన్ కూడా సంతోషపడ్డారు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా బోయపాటి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమాని రీమేక్ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వాళ్ళు ‘ఆవేశం ‘ సినిమా రైట్స్ ని తీసుకున్నారని ఆ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్రని బాలయ్య బాబుతో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దీనికి తోడుగానే ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తే ఇంకా బాగుంటుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి… అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఆవేశం సినిమాలో ఫహద్ పజిల్ పోషించిన పాత్ర చాలా అగ్రేసివ్ గా ఉంటుంది. అలాగే డిఫరెంట్ వే లో పోట్రే చేసుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది ఇక ఈ పాత్రని బాలయ్య బాబు చేస్తే బాగుంటుంది. కానీ అసలు ఈ పాత్ర గురించి ఆయన ఆలోచించడం లేదని, ఇక కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటూ కొంతమంది ఆయన సన్నిహితులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.

    ఇలాంటి సమయంలో ఆయన ఆవేశం సినిమాని రీమేక్ చేసే ఉద్దేశం ఆయనకు ఉందో లేదో తెలియదు కానీ ఆయన రీమేక్ లను ఎక్కువగా చేస్తాడు. కాబట్టి ఆయన ఈ సినిమా చేస్తున్నాడు అంటూ కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక వీటికి చెక్ పెట్టడానికి ఎవరో ఒకరు స్పందించి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలను చెబితే తప్ప ఈ పుకార్లకు పులిస్టాప్ పడే అవకాశమైతే లేనట్టుగా తెలుస్తుంది…

    ఇక మొత్తానికి అయితే హరీష్ శంకర్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనక కొట్టినట్టు అయితే ఆయనకు కూడా బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక బాలయ్య బాబు తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం రీమేకులు కాకుండా ఒక స్ట్రైయిట్ కథతోనే సినిమాను చేస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…