https://oktelugu.com/

Tollywood: ఆగస్టు 15 రోజున భారీ పోటీ జరగనుందా..? ఏ సినిమా పరిస్థితి ఎలా ఉందో తెలుసా..?

గత కొద్ది రోజుల నుంచి తెలుగులో పెద్ద సినిమాలు ఏమీ రావడం లేదు. ఇక అడపాదడపా చిన్న సినిమాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించడం లేదు. కాబట్టి ప్రేక్షకులందరూ ఇప్పుడు భారీ సినిమాల కోసం ఎదురుచూస్తున్న వేళ ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 01:30 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: ఈ నెలలో సినిమాల జాతర జరగబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు సినిమా యూనిట్ తో పాటుగా ఆయా హీరోల అభిమానులను కూడా చాలావరకు కలవరపెడుతుందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15 ను పురస్కరించుకొని వస్తున్న సినిమాలు ఏంటి? వాటి మీద ఎలాంటి హైప్ ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం మాస్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ను నింపేసారు. ఇది చూసిన జనాలు సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

    పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రేక్షకులో ఒక మోస్తరు అంచనాలను కలిగి ఉంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద బాలీవుడ్ జనాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కాబట్టి ఆ ఫ్లేవర్ తోనే మరోసారి భారీ హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్ విపరీతంగా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని పూరి జగన్నాధ్ చాలా ఆరాటపడుతున్నాడు…

    ఇక ఎన్టీఆర్ బామ్మర్ది గా ఇండస్ట్రీ కి వచ్చి మ్యాడ్ సినిమా తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నార్నే నితిన్ కూడా ఆయ్ అనే సినిమాతో ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే చిన్న సినిమాగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఆధ్యాంతం కామెడీగా ఉండడమే కాకుండా ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంది. కాబట్టి ఈ సినిమాకి కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది…

    ఇక వీటితోపాటుగా తమిళ్ నటుడు అయిన విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న తంగలాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా కూడా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాలకు పోటీ గా ఒక డబ్బింగ్ సినిమా కూడా వస్తుండటం వల్ల తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరక్కపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు… ఇక ప్రతిసారి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మైమరిపింపజేసే విక్రమ్ ఈసారి కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    మరి ఆయన చేసిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను రంజింపచేస్తుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధించి ఆయా హీరోలకు దర్శకులకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఆగస్టు15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…