https://oktelugu.com/

Ariyana Glory : అరియానాకు ఆ హీరో తో ఎఫైర్? ఆరోపణలపై అసలు నిజం వెలుగులోకి..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలుగా గుర్తింపు పొందిన వాళ్లు మొదట్లో మంచి విజయాలను అందుకుంటున్నారు. కానీ ఆ తర్వాత కెరియర్ ని ఎలా ముందుకు తీసుకెళ్లలో తెలియక డైలామాలో పడుతున్నారు. ఇక మరికొందరైతే వివాదాల్లో చిక్కుకొని వాళ్ల కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 6, 2024 / 03:38 PM IST

    Ariyana Pregnancy

    Follow us on

    Ariyana Glory  : గత నెల రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ కి సంబంధించిన ఒక వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది… లావణ్య అనే ఒక అమ్మాయి రాజ్ తరుణ్ తనని మూడుసార్లు ప్రెగ్నెంట్ ని చేసి అబార్షన్ కూడా చేయించాడని, గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రేమించుకుంటున్నాం అని కూడా చెబుతూ చాలా ఆరోపణలైతే చేసింది. ఇక దాదాపు ఏడు సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉన్నారంటు ఆమె తెలియజేయడం విశేషం.. ఇక ఇదిలా ఉంటే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరో ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకోవడం అనేది కొంతవరకు అతని కెరియర్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి.

    అయినప్పటికీ లావణ్య అనే అమ్మాయి మాత్రం రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, తనను పెళ్లి కూడా చేసుకున్నాడని వాటన్నింటికి సంబంధించిన ప్రూవ్స్ తన దగ్గర ఉన్నాయని అలాగే తను లీగల్ గా వెళుతున్నానని కూడా చాలా సందర్భాల్లో తెలియజేసింది. ఇక రాజ్ తరుణ్ తన నుంచి విడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఫేమ్ ‘అరియానా గ్లోరీ’ తో రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేశారని అందువల్లే ఆమె ప్రేగ్నంట్ కూడా అయిందని కొన్ని ఆరోపణలైతే చేసింది. ఇక ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉందని ఆ తర్వాత రాజ్ తరుణ్ కి ఆమెకి మధ్య రిలేషన్ షిప్ కుదరడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడడం వల్ల ఆమె ప్రేగ్నంట్ అయింది. ఇక దానివల్లే లావుగా అయింది అంటూ కొన్ని ఆరోపణలు చేస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ లోకి ‘ఆర్ జె శేఖర్ బాషా’ ఎంటర్ అవ్వడంతో కేసు కొత్త మలుపులు తిరిగుందనే చెప్పాలి. ఇక ఎప్పుడైతే అర్జె శేఖర్ భాషా లావణ్య చెప్తున్నావన్ని అబద్ధాలు అంటూ మీడియా ముందుకు వచ్చాడో ఆమె గురించి ఒక్కొక్క నిజం బయటపెడుతూ వస్తున్నాడు. లావణ్య బాగా తాగుతూ రాజ్ తరుణ్ ను రోజు కొట్టేదని, అలాగే చాలామంది ఆడవాళ్ళకి తను డ్రగ్స్ కూడా అలవాటు చేసిందని చెబుతున్నాడు..ఇక రాజ్ తరుణ్ అరియనా కి మధ్య రిలేషన్ షిప్ ఉందనే విషయం మీద కూడా తను అరియనా ను కనుక్కున్ననని చెప్పాడు.

    అలాగే దీనిమీద అరియనా స్పందిస్తూ ‘‘ఒక ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదు అంటూ లావణ్య మాట్లాడుతూనే మరో ఆడబిడ్డ అయిన తన పేరుని మీడియా ముందు ప్రస్తావించడం అనేది సంస్కారమేనా నాకు అర్థం కావడం లేదు’’ అంటూ అరియనా బాధపడుతూ తనతో చెప్పిందని శేఖర్ బాషా తెలియజేశాడు. తను ఒక సినిమా షూట్ కోసం లావు అవుతున్నాననే విషయాన్ని కూడా నాతో చెప్పిందంటు శేఖర్ భాషా మీడియా ముందు చెప్పాడు.. అలాగే అరియనా తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని ఇలాంటి సందర్భంలో ఆమె మీద ఇలాంటి కామెంట్లు చేయడం అనేది సరైన విషయం కాదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు.ఇలా లావణ్య చెప్తున్నా వన్ని అబద్ధాలు అంటు చెప్తున్న శేఖర్ భాషా ఈ కేసుని కొత్త మలుపులు తిప్పుతున్నాడు… మరి ఇప్పటికైనా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…