Apologizing Pushpa: అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. తొలిసారి బన్నీ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలకు ముస్తాబు అవుతోంది. దీంతో ఈ సినిమా కోసం అల్లు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్రయూనిట్ అదిరిపోయే రీతిలో చేస్తోంది.

‘పుష్ప’కు సంబంధించిన ప్రమోషన్స్ ను అల్లు అర్జున్ దగ్గరుండి చూస్తున్నారు. ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మారి ప్రమోషన్స్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీ ప్రచారానికి అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజు అవుతోంది.
ఇటీవలే ప్రీ రిలీజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ‘పుష్ప’ అన్ని భాషల్లో అదిరిపోయేలా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా కన్నడనాట కూడా ‘పుష్ప’ టీం బుధవారం ప్రెస్ మీట్ పెట్టింది. అయితే ఈ ప్రెస్ మీట్ బన్నీ ఆలస్యంగా వెళ్లాడు బన్నీ కోసం మీడియా మిత్రులంతా దాదాపు రెండుగంటలపాటు వెయిట్ చేయాల్సిందే.
ఎట్టకేలకు బన్నీ రావడంతో ప్రెస్ మీట్ ప్రారంభమైంది. వెంటనే ఓ విలేకరి లేచి ‘మీరు ఆలస్యంగా వచ్చారు.. మీ కోసం అంతా ఎదురు చూశాం.. కనీసం సారి కూడా చెప్పకుండా ప్రెస్ మీట్ మొదలెడుతారా?’ అంటూ నిలదీశారు. దీంతో బన్నీ అవాక్కాయ్యాడు. ఆ వెంటనే తేరుకొని మీడియా మిత్రులకు సారీ చెప్పాడు.
Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !
పొగమంచు వల్ల ఫ్లైయిట్ ఆలస్యమైందని తెలిపాడు. సారీ చెప్పడానికి తను సంకోచించని.. సారీ చెప్పడం వల్ల మనిషి ఎదుగుతాడు తప్ప తగ్గడని వేదాంత ధోరణిలో చెప్పాడు. బన్నీ వ్యాఖ్యలతో సంతృప్తి చెందిన విలేకరుల ప్రెస్ మీట్ ను యథావిధిగా కొనసాగించారు. కాగా దీనికి ముందు రోజు హైదరాబాద్ లోనే ఇదే సీన్ రిపీట్ అయింది.
‘పుష్ప’ టీం మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. ఎప్పటిలాగే బన్నీ ప్రెస్ మీట్ కు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. అయితే మన విలేకరులెవరు ఆయన్నీ సారీ చెప్పమని కూడా అడగలేదు. తెలుగు మీడియా పెద్ద మనస్సు చేసుకొని టేక్ ఇన్ ఫర్ గ్రాండ్ అన్నట్లుగా వదిలేసింది. దీంతో బన్నీకి అందరూ తెలుగు మీడియాలా ఉండరనే విషయమై తెలిసోచ్చింది.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…