https://oktelugu.com/

Anupama Parameswaran: అందరి ముందు ఆ పని చేయడం చాలా కష్టం… అనుపమ పరమేశ్వరన్ ఓపెన్ కామెంట్స్

లిల్లీ పాత్రను నేను రిజెక్ట్ చేస్తే అంతకంటే తెలివి తక్కువ పని ఉండదు. దర్శకుడు ఇచ్చిన మేరకు నా పాత్రకు న్యాయం చేశాను... అని ఆమె అన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 26, 2024 / 11:06 AM IST

    Anupama Parameswaran Comments on Romance Scenes

    Follow us on

    Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ కి హోమ్లీ ఇమేజ్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఒకింత ఛాలెంజింగ్ రోల్ చేసింది అమ్మడు. టిల్లు స్క్వేర్ మూవీలో గతంలో ఎన్నడూ చేయని గ్లామరస్ రోల్ చేసింది అనుపమ. ఇలాంటి పాత్ర ఒప్పుకోవడానికి కారణం కూడా చెప్పింది ఆమె. ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్రలు చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే టిల్లు స్క్వేర్ మూవీలో భిన్నమైన రోల్ చేశాను. చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుంది. లిల్లీ పాత్రను నేను రిజెక్ట్ చేస్తే అంతకంటే తెలివి తక్కువ పని ఉండదు. దర్శకుడు ఇచ్చిన మేరకు నా పాత్రకు న్యాయం చేశాను… అని ఆమె అన్నారు.

    అలాగే అలాంటి సన్నివేశాల్లో నటించడం మీద కూడా ఆమె స్పందించారు. కెమెరా ముందు రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదని అనుపమ అన్నారు. ఇద్దరి మధ్య సాంగత్యం అనేది ప్రైవేట్ వ్యవహారం. సెట్ లో అందరి ముందు చేయాలి. వంద మంది చూస్తుండగా రొమాన్స్ చేయాలి. అందరూ కారులో సీన్ గురించి అడుగుతున్నారు. ఆ సన్నివేశం తెరకెక్కించేటప్పుడు నేను చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కానీ తప్పదు. మనం నిజంగా రొమాన్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు నటించాలి.

    జనాలు రొమాంటిక్ సన్నివేశాల్లో మేము ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. అది నిజం కాదు. చాలా ఇబ్బందిగా ఉంటుందని… అనుపమ వెల్లడించారు. డీజే టిల్లు ట్రైలర్ చూసిన జనాలకు మైండ్ బ్లాక్ అయ్యింది. ముఖ్యంగా అనుపమ క్యారెక్టరైజేషన్ షాక్ ఇచ్చింది. కెరీర్ బిగినింగ్ నుండి ఆమెకున్న ఇమేజ్ రీత్యా అలాంటి సన్నివేశాల్లో ఆమెను చూసి కొందరు జీర్ణించుకోలేకపోయారు.

    ఓ అభిమాని అయితే ఆవేదన చెందుతూ వీడియో విడుదల చేశాడు. అనుపమ మరో సావిత్రి, సౌందర్య అవుతుంది అనుకుంటే… ఇలాంటి పాత్ర చేసిందేంటి. దయచేసి టిల్లు స్క్వేర్ తరహా చిత్రాల్లో నటించవద్దని సదరు అభిమాని వేడుకున్నాడు. సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించాడు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.