Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 6 లో వచ్చినన్ని ట్విస్టులు ఏ సీజన్ లో కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఈ సీజన్ ప్రారంభం చాలా నత్తనడకన సాగింది..ఇక ఆ తర్వాత టీఆర్ఫీ రేటింగ్స్ పెంచడం కోసం..ఆటని ఆసక్తికరంగా మార్చడం కోసం ఎన్ని చెయ్యాలో అన్నీ చేసాడు బిగ్ బాస్..ప్రస్తుతానికి అయితే గాడిలో తెచ్చి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని రప్పిస్తున్నారు బిగ్ బాస్ టీం..కానీ ఎలిమినేషన్స్ ఎవ్వరూ ఊహించనివి జరుగుతుండడం వల్ల ప్రేక్షకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది.

నిన్న రాజ్ ఎలిమినేషన్ కూడా చూసే ప్రతీ ఒక్కరికి చాలా అన్యాయం అనిపించింది..ఎందుకంటే అతను పేక్షకుల వోటింగ్ ద్వారా బయటకి వెళ్ళలేదు..’ఏవిక్షన్ ఫ్రీ పాస్’ వల్లనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది..ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ద్వారా ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయబోతున్నారట..అది ఈ మంగళవారం..అనగా రేపే జరగబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది.
ఒక టాస్కు నిర్వహించి ఆ టాస్కులో ఓడిపోయిన వారిని బిగ్ బాస్ ఇంటికి పంపేయబోతున్నట్టు సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది..ఇలా బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ సార్థక్ ని ఇలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసారు..కానీ అతనిని సీక్రెట్ రూమ్ కి పంపి వీకెండ్ లో మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టేలా చేసాడు బిగ్ బాస్..కానీ ఈ సీజన్ లో అసలు సీక్రెట్ రూమ్ అనేదే లేదట..కాబట్టి ఒక్కసారి హౌస్ నుండి అడుగుతీసి బయటపెడితే ఇక ఎలిమినేట్ అయిపోయినట్టే లెక్క..ఇప్పుడు అలా మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎవరు ఇంటి నుండి బయటకి వెళ్ళబోతున్నారో చూడాలి.

సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతునట్టే టాస్కు ద్వారా ఎలిమినేట్ చేస్తారా..లేదా కంటెస్టెంట్స్ వోటింగ్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేయబోతున్నారా అనేది చూడాలి..కంటెస్టెంట్స్ వోటింగ్ ప్రకారమే బయటకి పంపే ప్రక్రియ వస్తే మాత్రం రోహిత్ మరియు ఇనాయ డేంజర్ లో ఉన్నట్టే అని విశ్లేషకులు చెప్తున్నా మాట..చూడాలిమరి రేపు ఏమి జరగబోతుందో.