Anchor Pradeep: ఈటీవీ లో ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..జబర్దస్త్ , ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారింది ఈటీవీ ఛానల్..BAARC సంస్థ ఇచ్చే TRP రేటింగ్స్ లో ఈటీవీ ఛానల్ ఇప్పటికి అగ్ర స్థానం లో కొనసాగుతుంది అంటే ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు..అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి క్రేజ్ బాగా తగ్గిపోయాయి..రోజు రోజుకి ఈ షోస్ ని చూసే వారి సంఖ్య తగ్గుతూ పోతుంది..దానికి కారణం ఈ షోస్ కి మొదటి నుండి బ్యాక్ బోన్ లాగా ఉంటూ వస్తున్నా కంటెస్టెంట్స్ మరియు యాంకర్స్ ఒకరి తర్వాత ఒకరు షోస్ మానేస్తు పోవడం వల్లే.. ముందుగా జబర్దస్త్ షో నుండి హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ మానేశారు..వీరితో పాటు గతం లో చమ్మక్ చంద్ర మరియు షకలక శంకర్ వంటి వారు కూడా ఈ షో ని మానేశారు..ఇలా ఒక్కసారిగా అందరూ ఈ షోస్ అన్ని మానేయడం తో TRP రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

Also Read: Sukesh Chandrashekar: జైల్లోనే ఆఫీసు పెట్టాడు.. ఏకంగా సినీ ఇండస్ట్రీనే షేక్ చేశాడు.. చివరకు ట్విస్ట్
అప్పట్లో ఢీ షో లో కంటెస్టెంట్స్ డాన్స్ మధ్య బ్రేక్ లో వచ్చే సుడిగాలి సుధీర్ స్కిట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి..చాలా మంది ఈ షో ని డాన్స్ చూడడం కోసం కంటే ఎక్కువగా సుధీర్ – ప్రదీప్ – హైపర్ ఆది చేసే కామెడీ కోసమే ఎక్కువగా చూస్తారు..అయితే ఈ షో నుండి సుధీర్ , రష్మీ మరియు వర్షిణి వంటి వారు బయటకి వచ్చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పంచులు వేసే శేఖర్ మాస్టర్ కూడా ఈ షో మానేయడం తో ఒక్కసారిగా ఈ షో క్రేజ్ కూడా పడిపోయింది..ఇప్పుడు లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ఏమిటి అంటే అతి త్వరలోనే యాంకర్ ప్రదీప్ కూడా ఈ షో కి గుడ్బై చెప్పనున్నాడట..అడిగినంత రెమ్యూనరేషన్ మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇవ్వనందునే ఈ షో ని ప్రదీప్ కూడా మానేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వారు కూడా ఈ కారణం చేతనే ఈటీవీ ని వదిలినట్టు తెలుస్తుంది.

[…] […]