https://oktelugu.com/

Anasuya Bharadwaj: మీ ఊరికి అనసూయ వచ్చేస్తుంది… స్టార్ యాంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

తాజాగా అనసూయ ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ సిటీ లో కొత్త షాపింగ్ మాల్ కి రిబ్బన్ కటింగ్ చేయనుంది. ఇందుకోసం తాను ఏపీకి వస్తున్నట్లు అనసూయ స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 24, 2024 / 04:32 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. నటిగా తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. బుల్లితెర యాంకర్ గా మొదలై స్టార్ గా ఎదిగింది. వరుస సినిమాలతో అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉంది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మైంటైన్ చేస్తుంది. ఇక ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉన్నా అనసూయ తళుక్కున మెరవాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో బిజీగా ఉంటుంది. ఆమెను చూడడానికి జనం కూడా భారీ స్థాయిలో వస్తుంటారు.

    తాజాగా అనసూయ ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ సిటీ లో కొత్త షాపింగ్ మాల్ కి రిబ్బన్ కటింగ్ చేయనుంది. ఇందుకోసం తాను ఏపీకి వస్తున్నట్లు అనసూయ స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో గల ఎస్ కోటకు అనసూయ వస్తున్నట్లు తెలిపింది. విజయనగరం జిల్లా, శృంగవరపు కోటలో గల ఓ షాపింగ్ మాల్ ను అనసూయ ప్రారంభించనుంది. ఈ నెల 25 ఆదివారం నాడు ఎస్ కోటలో అనసూయ సందడి చేయనుంది.

    గ్లామరస్ యాంకర్ గా పిచ్చ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అందుకే అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు. అనసూయతో సెల్ఫీల కోసం యువత ఎగబడుతూ ఉంటారు. ఇప్పటికే అనసూయ ప్రధాన పట్టణాల్లో పలు షాపింగ్ మాల్స్ కి రిబ్బన్ కటింగ్ చేసింది. ఒక పక్క సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు ప్రమోషన్స్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది.

    ఇక కెరీర్ పరంగా అనసూయ చేతిలో ఆఫర్స్ కు కొదవలేదు. ప్రస్తుతం అనసూయ రాజా కార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. అలాగే పుష్ప 2 లో దాక్షాయణి గా మెప్పించనుంది. గత ఏడాది రంగ మార్తాండ, విమానం, ప్రేమ విమానం, మైఖేల్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనసూయ నటించింది.