https://oktelugu.com/

Allu Aravind: దిల్ రాజు ఒక్కడు మాత్రమే అలాంటివి సక్సెస్ ఫుల్ గా చేయగలడు…

ఫస్ట్ సినిమాలతో దర్శకులకు కూడా అవకాశం ఇచ్చే నిర్మాత దిల్ రాజు అని చెప్పగా, దానికి అల్లు అరవింద్ నవ్వుతూ మీరు కూడా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి అని అనగా ఆ మాటలు విన్న అల్లు అరవింద్ నేను అలాంటి సాహసం చేయలేను అంటూ తిరిగి సమాధానం ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 24, 2024 / 07:56 AM IST

    Allu Aravind

    Follow us on

    Allu Aravind: తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన నిర్మాత దిల్ రాజు… అయితే ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలనైతే సాధించలేకపోతున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా మిగులుతుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం భారీ ప్లాప్ లుగా మిగులుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తన తమ్ముడి కొడుకు అయిన శిరీష్ ను హీరోగా పెట్టి చేసిన “లవ్ మీ” అనే సినిమా చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక అందులో భాగంగానే ఈ ఈవెంట్ కి అల్లు అరవింద్ ముఖ్య అతిది గా వచ్చారు. ఇక ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చూస్తుంటేనే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా అనిపించింది. ఇక ఇంతకు ముందు ఈ సినిమా దర్శకుడైన అరుణ్ ఇంతకుముందు ఏదైనా సినిమా చేసావా అని అడిగాను అతను చేయలేదు అని చెప్పాడు.

    ఇక ఫస్ట్ సినిమాలతో దర్శకులకు కూడా అవకాశం ఇచ్చే నిర్మాత దిల్ రాజు అని చెప్పగా, దానికి అల్లు అరవింద్ నవ్వుతూ మీరు కూడా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి అని అనగా ఆ మాటలు విన్న అల్లు అరవింద్ నేను అలాంటి సాహసం చేయలేను అంటూ తిరిగి సమాధానం ఇచ్చాడు. ఇక ధైర్యం గాకొత్త డైరెక్టర్స్ ను పరిచయం చేసి హిట్టు కొట్టడం లో ఆయనను మించిన ప్రొడ్యూసర్ లేడు అంటూ మాట్లాడటం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు దిల్ రాజు పరిచయం చేసిన చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

    ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు మాట్లాడుతూ హర్షిత, హన్షితలను ప్రొడ్యూసర్లుగా మార్చాలనే ఉద్దేశ్యం తోనే వాళ్ళ చేత ముందు ప్రయత్నంగా ‘బలగం ‘ సినిమా చేయించాను. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో ప్రయత్నం గా ‘లవ్ మీ’ సినిమాతో మరోసారి అరుణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాము అని అంటూ దిల్ రాజు చెప్పాడు…