Nagarjuna Marriage Photo: సోషల్ మీడియాలో నాగార్జున మొదటి పెళ్లి ఫోటో వైరల్ గా మారింది. మూడు దశాబ్దాల క్రితం నాటి ఆ ఫొటోలో నాగార్జున అచ్చు నాగ చైతన్యను పోలి ఉన్నాడు. కింగ్ నాగార్జున సినిమాల్లోకి రాకముందే వివాహం చేసుకున్నారు. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లి సంబంధం కుదిరింది. రామానాయుడు తన కూతురు లక్ష్మీని నాగార్జునకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు.విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన నాగార్జున పెద్దల మాట కాదనుకుండా పెళ్ళికి వెంటనే ఓకే చెప్పేశారు.

నాగార్జున అప్పటికి ఇంకా వెండితెరకు పరిచయం కాలేదు. 1984లో నాగార్జున-లక్ష్మీ వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళైన రెండేళ్లకు నాగార్జున 1986లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం విక్రమ్. అనుకోకుండా లక్ష్మీతో నాగార్జునకు మనస్పర్థలు తలెత్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. 1990లో అధికారికంగా విడాకులు తీసుకొని లక్ష్మీ-నాగార్జున విడిపోవడం జరిగింది. అనంతరం 1992లో హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమించి వివాహం చేసుకున్నారు.
మొదటి వివాహం జరిగే నాటికి నాగార్జున వయసు సరిగ్గా 25 ఏళ్ళు. ఆ జనరేషన్ లో పెళ్లి అనేది కరెక్ట్ ఏజ్ లో జరగాలని పెద్దవాళ్ళు భావించేవారు. అందుకే సెటిల్ కాకముందే నాగార్జునకు అక్కినేని నాగేశ్వరావు వివాహం చేశారు. ఆ వయసులో నాగార్జున అచ్చు నాగ చైతన్యలానే ఉన్నారు. ప్రింట్ తీసినట్లు తండ్రి పోలికలతో నాగ చైతన్య పుట్టాడని అర్థం అవుతుంది. నాగార్జున మొదటి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాగార్జున మొదటి భార్య లక్ష్మీ కుమారుడైన చైతన్య చాలా కాలం అమ్మ దగ్గరే పెరిగాడు. అందుకే మామయ్యలు వెంకటేష్, సురేష్ బాబులతో చైతూకి మంచి అనుబంధం ఉంది. అయితే నాగ చైతన్యను హీరోగా పరిచయం చేసే బాధ్యత నాగార్జున తీసుకున్నాడు. తన వారసుడిగా ప్రమోట్ చేశారు. చైతూ మొదటి చిత్రం జోష్ కమర్షియల్ గా ఆడకున్నప్పటికీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తనకంటూ ఓ ఇమేజ్, మార్కెట్ చైతూ సొంతం చేసుకున్నాడు.