Akira Nandan: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక వాళ్ల సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ల లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకు నటుడిగా కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అటు పొలిటికల్ గా ముందుకు సాగుతూనే, సినిమాలను కూడా చేస్తూ రెండు పడవల మీద ప్రయాణం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కొడుకు అయిన ‘అఖిరా నందన్’ సినిమా ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక దీని మీద ఎవరు ఎలాంటి స్పందన తెలియజేయనప్పటికీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే 2000 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన బద్రి సినిమాని రీమేక్ చేస్తూ ఆ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి బద్రి సినిమా కమర్షియల్ గా భారీ హిట్ అయింది. అయితే ఈ సినిమాను రీమేక్ చేసిన కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అఖిరా ఎంట్రీ ఇప్పుడప్పుడే ఉండే అవకాశాలైతే లేవు. ఆయన ఎంట్రీ కి మరొక రెండు మూడు సంవత్సరాలు పట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే ఇప్పుడు తను చదువు కుంటున్నాడు కాబట్టి చదువు పూర్తి అయిన తర్వాత ఆయన సినీ రంగ ప్రవేశం ఉండనున్నట్టు గా అప్పట్లో రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసింది. ఇతను రెండు సంవత్సరాలకు సినిమా చేసిన లేదా మూడు సంవత్సరాల వరకు చేసిన కూడా తన మొదటి సినిమాగా బద్రి సినిమాని రీమేక్ చేస్తేనే బాగుంటుందని రేణు దేశాయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.