https://oktelugu.com/

Ahasas Channa: అబ్బాయిగా నటించి హీరోయిన్ అయిన ఈమె ఎవరో తెలుసా?

అహ్సాన్ చన్నా.. ఈమె ముంబైలోని పంజాబీ కుటుంబంలో 1995 ఆగస్టు 5న జన్మించింది. తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా సిని నిర్మాత. తల్లి కుల్బీర్ బడెస్రాన్ నటి. అహ్సాస్ 5 ఏళ్ల వయసులో ఉండగానే సినీ రంగంలోకి ప్రవేశించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2024 / 11:05 AM IST

    Assan channa

    Follow us on

    Ahasas Channa: సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు నుంచి హీరోగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు సక్సెస్ ఫుల్ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. మరికొందరు టీవీ ఆర్టిస్టులుగా.. ఇంకొందరు ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లోకి అబ్బాయిలా కనిపించి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారందంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అమె ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్ గురించి ఇండస్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించిన వారు ఆ తరువాత హీరో లేదా హీరోయిన్ అవుతారు. కానీ ఈమె చిన్నప్పుడు బాయ్ పాత్రలు వేసింది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ ‘కబీ అల్విదా నా కెహనా’ ఈ సినిమాలో షారుఖ్, ప్రీతి జింటా కొడుకుగా నటించింది. ఆ తరువాత ‘వాస్తు శాస్త్రం’ లో సుస్మితీ సేన్ కొడుకుగా నటించింది. ఇలా అమ్మాయి అయి ఉండి అబ్బాయి పాత్రలు నటించి మెప్పించింది. కానీ ఆ తరువాత హీరోయిన్ గా నటిస్తూ మెప్పిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరంటే..

    అహ్సాన్ చన్నా.. ఈమె ముంబైలోని పంజాబీ కుటుంబంలో 1995 ఆగస్టు 5న జన్మించింది. తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా సిని నిర్మాత. తల్లి కుల్బీర్ బడెస్రాన్ నటి. అహ్సాస్ 5 ఏళ్ల వయసులో ఉండగానే సినీ రంగంలోకి ప్రవేశించింది. చిన్నప్పుడు దాదాపు పలు సినిమాల్లో అబ్బాయి పాత్రలు వేసి మెప్పించింది. 2007లో వచ్చిన ‘మై ఫ్రెండ్ గణేశ్’ చిత్రంలో అబ్బాయి అశు పాత్రలో నటించింది.

    ఆ తరువాత పెరిగి పెద్దాయ్యాక రాంగోపాల్ వర్మ చిత్రం ‘పూంక్’లో రక్ష పాత్రలో మొదటి సారి హీరోయిన్ పాత్రలో కనిపించింది. ఆ తరువాత అహ్సన్ కు అవకాశాలు వచ్చాయి. ‘కసమ్ సే’, ఓయే జస్సీ, క్రైమ్ పెట్రోల్ వంటి షార్ట్ ఫిలింస్ లో కనిపించి ఆకట్టుకుంది. అయితే వెబ్ సిరీస్ లో కి ఎంట్రీ ఇచ్చిన తరువాత అహ్సన్ జీవితం మారిపోయింది. ‘గర్ల్స్ హాస్టల్’, ‘హాస్టల్ డేస్’, ‘మిస్ మ్యాచ్డ్2’ వంటి వెబ్ సిరీసుల్లో నటించింది. ప్రస్తుతం అహ్సస్ పలు కంపెనీలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.