Adipurush Teaser: ఆదిపురుష్ తో ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన గత రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచిన నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు. నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ తో బాక్సాఫీస్ దుమ్ముదులపాలి అనుకుంటున్నారు. దీనికి ప్రభాస్ వేస్తున్న ప్రణాళికలు మాములుగా లేవు. ఆదిపురుష్ ప్రమోషన్స్ ప్రభాస్ చాలా పకడ్బందీగా, దేశం మొత్తం చెప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిపురుష్ టీజర్ విడుదల వేదికగా అయోధ్యను ఎంచుకున్నారు. అక్టోబర్ 2న రామ జన్మభూమి అయోధ్యలోని సరయు నదీ తీరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేస్తున్నారు.

ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కింది. ప్రభాస్ ఈ చిత్రంలో రామునిగా కనిపించనున్నారు. హిందువులకు రాముడు అత్యంత ప్రీతి పాత్రుడైన దేవుడు. ఈ సెంటిమెంట్ ని ఆదిపురుష్ టీం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. దాని కోసమే టీజర్ రామజన్మ భూమి అయోధ్య నుండి విడుదల చేస్తారు. సినిమాకి హిందూ సెంటిమెంట్ జోడించి భారీ వసూళ్లను సాధించాలని భావిస్తున్నారు. అయోధ్య వేదికగా చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు.
Also Read: Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో పండుగ
ఇక కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక పాత్ర చేస్తున్నారు. అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాముడు గా కనిపించనున్నారు. పౌరాణిక పాత్రలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో నెలకొంది . వారి ఆతృతకు మరికొన్ని రోజుల్లో తెరపడనుంది. ఆదిపురుష్ టీజర్ కున్న డిమాండ్ రీత్యా అనేక రికార్డ్స్ బద్దలు కొట్టడం, చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ చేయాలని చూస్తున్నారు.

కాగా ఆదిపురుష్ మూవీపై రాజకీయ వివాదాలు కూడా ఉన్నాయి. ఈ మూవీ బీజేపీ పార్టీ రాజకీయ అజెండాలో భాగం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ప్రభాస్ తో ఈ సినిమా చేయించారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణా మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఈ ఆరోపణలు చేశారు. ఆ విషయం అటుంచితే దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతి సనన్ సీత పాత్ర చేశారు. విలన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. 2023 జనవరి 12న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
Also Read: Rashmika Mandanna: రష్మిక ఆటోగ్రాఫ్ అతని గుండెలపై.. చూస్తే తట్టుకోలేరు
[…] […]
[…] Also Read: Adipurush Teaser: Adipurush Teaser Launch at Ayodhya Venue… Prabhas Master Plan to Loot Hundre… […]
[…] […]