https://oktelugu.com/

Kadambari: మంచి మనసు చాటుకున్న సినిమా స్టార్? ఎవరో తెలుసా?

ముక్కుకు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్న విదిష అనే బాలిక, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న చంద్రకళ అనే అమ్మాయికి కూడా రూ. 25వేల సహాయం చేశారు. ఇక తాజాగా పావలా శ్యామల కు కూడా కొంత డబ్బును అందించారు

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 29, 2024 / 11:51 AM IST
    Follow us on

    సేవా కార్యక్రమాలు చేయాలంటే మంచి మనసు ఉంటే సరిపోతుంది. వారికి తోచిన సహాయం చేస్తుంటారు. అదే విధంగా ఓ సినిమా స్టార్ కూడా తనకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్న కాదంబరి. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకున్న ఈయన సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు మనం సైతం ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కూడా.

    సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రమే కాదు తాజాగా బయట వ్యక్తులకు కూడా సహాయం చేస్తున్నారు కాదంబరి. సీనియర్ నటి, హెయిర్ స్టైలిస్ట్ రంగస్థలం లక్ష్మీకి రూ. 25వేలు సహాయం అందించారు. ముక్కుకు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్న విదిష అనే బాలిక, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న చంద్రకళ అనే అమ్మాయికి కూడా రూ. 25వేల సహాయం చేశారు. ఇక తాజాగా పావలా శ్యామల కు కూడా కొంత డబ్బును అందించారు కాదంబరి. ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.

    కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకుంటున్న కాదంబరి సంతోషంగా ఉండాలని.. సేవా కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. అయితే మనం సైతం ఫౌండేషన్ పేరు కాదంబరి వల్ల మారుమోగుతోంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందించి మంచి మనసుతో స్పందిస్తూ ఆదుకుంటున్నారు.

    ఇక కాదంబరికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. వచ్చిన రెమ్యూనరేషన్ కూడా తక్కువే అని టాక్. అయినా కూడా తన మంచి మనసు చాటుతూ అందరినీ ఆదుకుంటున్నారు. ఇలాంటి వారికి అవకాశాలు వస్తే మరింత ఆదుకుంటారు. కాబట్టి కాదంబరికి సినిమా అవకాశాలు రావాలని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.